Saturday, June 1, 2013

ఆగక, నిలువక

నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది
నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది
గమ్యం లేని గమనాన్ని సాగించలేను
అర్ధంలేని యధనోప్పిని బరించలేను
అలా అని ఆగలేను, నిను తలవకుండా ఉండలేను
ఉరకలు వేస్తూ సాగుతున్న నా హృదయ ఊహాల తరంగాలకు
తీరం లేదని తెలిసినా అవి ఆగవు, నీకోసం అరవక మానవు 

Thursday, August 5, 2010

ఉహించగలవా ప్రియా

రాలిపోయాననుకొన్నాను
వాడిపోతాననుకొన్నాను
ఇక రెక్కలు ఉడి గాలికి ఎగిరిపోతాననుకొన్నాను
కాని నీ అందమైన చేతికి దొరకి
నిశిరాతిరిని తలపించే నీ కొప్పులో వెలుగుతాననుకోలేదు
ఆ వెలుగుతో నను చూసే ప్రతి మనసుకి గుచ్చుతాననుకోలేదు
అని నేనిచ్చిన పువ్వే నీతో అంటుంటే ....
నిను వలచిన నా మనసు ఇంకేమంటుందో ఉహించగలవా ప్రియా ...

Friday, July 30, 2010

చెప్పలేక... శిలనై

అరక్షణం లో వెలువడే నీ బదులకు,
ఆ బదులకు చప్పుడు చేసే నా గుండెకు
ఆ గుండెలో కట్టిన ప్రేమ గూడు భవితకు
ఆ భవితలో ముడి పడివున్న నా భవితకు భయపడి
చెప్పవలసిన మాట,
చెప్పవలసిన సమయంలో
చెప్పకుండా చాటుగా దాచి
చివరివరకు చెప్పకుండానే
మాటరాని శిలగా మిగిలిపోయాను ప్రియతమా ..
అంతేగాని
చెప్పే ధైర్యం లేక కాదు , నీ శ్వాసకు జీవమై ఉండలేక కాదు ,
నిను తోడుగా చేర్చుకొంధామనే ఆశ లేక కాదు ,
నీ అడుగులకు పాదాలుగా నిలువలేక కాదు

Sunday, July 11, 2010

నేస్తానికి విన్నపం

నేస్తమా
నా పెదవులపై చిరునవ్వులు వెలుగుతాయని
అవి నా గుండెల్లో ఆనందాన్ని నింపుతాయని
లేనిది వుందని బ్రమపరుస్తూ
ఆ బ్రమలో నాకు జోలపాడుతూ
మరచిపోయిన నా చెలి జ్ఞాపకాలకు చేరువచేస్తూ
నన్ను ఇలకు దూరం చేస్తున్నావు....
చూడు నేస్తమా
నా ప్రియురాలు జ్ఞాపకాలను జ్ఞప్తికి తెప్పించే
ఏ జ్ఞాపకాన్ని నా జ్ఞప్తికి తెప్పించి నా యదముందు పరచినా
అది కన్నీటి సుడే కాని, పన్నిటి తడి కాదు

మానుకో నేస్తమా ...తన ఉనికిని నా ముందు నిలపడం

ఎదురుగా నిలువలేక

చెరిగిపోయిన జ్ఞాపకాలు చెలరేగి
యదలో అలజడులు రేపుతాయోమోనని
ఆ రేపే అలజడులు నరనరాల్లో కదలాడి
గుండెను గాయం చేస్తాయోమోనని
గాయపడిన గుండె బాధను ఓర్చుకోలేక
కళ్ళల్లో కన్నీటిని నిమ్పుతున్దేమోనని
ఎదురుపడిన ఎదురుగా నిలువలేక
కనులను నేలకు దించి పోతున్నా ప్రియతమా

పరిణయం

నీ పరిచయం తో పరిచయమైన పరిచయాల పరిదినుండి
దూరంగా పారిపోవాలనే తపనతో
ఆ పరిచయాలు పంచిన పలకరింపులకు
స్వస్తి చెప్పాలనే ఆరాటం తో
నీ పరిచయం తో పరిచయమైన స్నేహం యొక్క పరిణయానికి
నా పాదాలను ముందుకు కదిపాను ప్రియా

Tuesday, July 6, 2010

ఎదురుచూపులు

కంచికి చేరని కధైపోయింది నా జీవితం
సాగరాన్ని చేరని నధైపోయింది నా గమ్యం
పువ్వుని చేరని తుమ్మధైపోయింది నా ప్రణయం
వెలుగే చేరని చోటైపోయింది నా గమనం

ఇక నా కధకు ముగుంపు పలికేదెవరు
నా గమ్యానికి నను చేర్చేదెవరు
నా ప్రణయానికి హరతినిచ్చేదెవరు
నా గమనానికి వెలుగు చూపేదెవరు
చీకటిలో చిరిగిపోతున్న నా చిరు ఆశల జీవితానికి
వెలుగు చూపే దేవత కోసం ఎదురుచూస్తూ

ఆగక, నిలువక

నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...