కనులు లేని గుడ్డి దానివి అనుకొన్నాను,
మాట్లాడలేని మూగ దానివి అనుకొన్నాను,
శ్రవణాలు లేని చెవిటి దానివి అనుకొన్నాను, కాని ..
.మనసు లేని కసాయి దానివి అని ..
అందులో, ఇంతటి ప్రళయాన్ని నింపుకొని ..ఆ ప్రళయం తో
అందమైన కళలు కనే కళ్ళలో
కన్నీటిని నదిలా పారిస్తావని,
గుప్పెడంత ఆశను నింపుకొన్న గుండెల్ని
ఎడారులుగా మారుస్తావని,
నిండుతున్న కడుపుల్లో మంటలు పుట్టిస్తావని,
ఉహకైనా అందనివ్వలేదు
ఓ కాలమా ....కోట్లాది హృదయాలను దోచినా..
ఆ హృదయాలలో కొలుచు కొంటున్నా
నీ హృదయానికి కానరాలేదా .
అందులో ఏమాత్రం జాలి కలుగ లేదా ,
చిరు నవ్వు లు చిందించే నాయకుణ్ణి దహనాగ్నికి బలిచేసావు..
కినుకైనా కరుణ కలగలేదా....
ప్రియమైన ముఖ్యమంత్రి అందుకో మా జోహార్లు ..........