ఎండిపోతున్న వాగుకి, రాలే చినుకులా
రాలిపోతున్న పువ్వుకి, వాలే తుమ్మదలా
వాలిపోతున్న పొద్దుకి, కురిసే వెన్నెలలా
కురుస్తున్న కుండబోత వానకి , నీడనిచ్చే గొడుగులా
నా హృదయం లోని ఆనందపుజల్లుని
నిరుత్సాహాపు ఎడారుల మద్య కురిపించి
వాడిపోతున్న ఆశకి వసంతపు పల్లకిని ఎక్కించి
చీకటి తెలియని దారుల్లో, నీ స్నేహమనే నీడతో
ఉహకందని ఉన్నతశిఖరాలకు సాగనంపావు
తీరేనా ఈ జన్మకు నీ ఋణం,కన్నీళ్ళతో నీ పాదాలు కడిగినా
తీరేనా ఈ జన్మకు నీ ఋణం,శిరస్సు వంచి ప్రణామాలు చేసినా ...
నీ కనుపాపల కవ్వింతలు ,చిరుపెదవుల ఉరడింపులు... నీ పాదాల మువ్వల చప్పుళ్ళు ,నీ అడుగుల్లో పంచుకొన్న అభిరుచులు..
Wednesday, April 7, 2010
Subscribe to:
Post Comments (Atom)
ఆగక, నిలువక
నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...
-
కంచికి చేరని కధైపోయింది నా జీవితం సాగరాన్ని చేరని నధైపోయింది నా గమ్యం పువ్వుని చేరని తుమ్మధైపోయింది నా ప్రణయం వెలుగే చేరని చోటైపోయి...
-
నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...
-
సాగర తీరపు అలలు నీ నడకలు కాగ అవిచేరే గమ్యం నా యదతీరం కాగ పొంగే నురగలు నీ నవ్వులు కాగ వాటికి తడసి నీలో నే కరిగిపోగ వీచే గాలులు నీ ఉపిరిలు ...
దుర్గా రావు గారు, మీరు ఇంత తక్కువ వ్యవధి లో ఇన్ని మంచి కవితలు ఎలా రాయగాలుగుతున్నారో నాకు అర్ధం కావట్లేదు. :) మీ కవితలు కొన్ని చదివాను. చాలా బావున్నాయి. మంచి భావుకత ఉంది మీలో :)
ReplyDeleteమీ అభిప్రాయానికి కృతజ్ఞతలు,చాలా సంతోషంగా కూడా ఉందండి అది చదివిన తరువాత. నిజం చెప్పాలంటే నేను డిగ్రీ చదుతున్నప్పటి నుండే నాకు రాసే అలవాటు ఉందండి .
ReplyDelete