Friday, August 14, 2009

విముక్తి


నిద్దర మరిచారు కానీ కలలు కన్నారు
తిండిని మరిచారు కానీ కడుపు నిండా ఆశను నింపుకొన్నారు
తల్లి తండ్రి ని మరిచారు ,కట్టుకొన్న వారిని మరిచారు
పుట్టిన పిల్లలను మరిచారు ,బంధు భంధవ్యలకు దూరంగా ఉన్నారు
కానీ జీవిత గమ్యం మరువలేదు ,
తమ ఉపిరి లో ప్రతీ గాలికనాన్ని నిప్పు కనికగా మార్చి
పగలనక రేయి అనకా ,ఎండనక వాన అనకా
కోట్ల భారతీయుల ముఖం లో చిరు నవ్వు నిలిపే రోజు కోసం
తెల్ల వాడి పాదాల మధ్య నలిగిపొయినా ,
ఆ నలిగిన పదాలమధ్య రక్తం ఏరులై పారినా
వాడి కసాయి తత్వానికి బలైపోయిన
పోరాటాన్ని ఆపలేదు ....
అలా .
మండే సూర్యుని అగ్ని జ్వాలలను ఉపిరిలో నింపుకొని
సింహం లోని ధీరత్వాన్ని నరనరల్లోని ఆకళింపు చేసుకొని
బానిస బ్రతుకు నుంచి స్వేచ్చను ప్రసాదించిన
స్వతంత్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ

No comments:

Post a Comment

ఆగక, నిలువక

నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...