నీ కనుపాపల కవ్వింతలు ,చిరుపెదవుల ఉరడింపులు... నీ పాదాల మువ్వల చప్పుళ్ళు ,నీ అడుగుల్లో పంచుకొన్న అభిరుచులు..
Monday, February 15, 2010
తిరుగమనం
ముసి ముసి నవ్వులను మొహం నిండా అద్దుకొని
మురిపెంగా పిలుస్తుంటే
మదిని మందలించి తనతో ముందడుగు వేయాలా ..
మరచిన గతాన్ని పిలచి దూరంగా పోవాలా
కనురెప్పల చాటున కన్నీళ్ళని దాచుకొని
పలికే పెదాలలో వణుకును నింపుకొని
మారానని మారం చేస్తూ
మదిని మెలికలు పెట్టేస్తున్న తన వ్యధను
మౌనంగా స్వీకరించాలా........
కళ్ళల్లో కన్నీటి నదులను పరిగెత్తించి
గుండెల్లో ఉప్పెనలను రేకెత్తించి
నా మనసుకి చేసిన గాయానికి
బదులు తీర్చుకోనా
Sunday, February 14, 2010
మనసు మారిన స్నేహం
బదులు లేని ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్న నీ మనసు కి
ఏమని బదులు చెప్పాలి..
బాషకు రాని భావాలను చూపే నీ రూపాన్ని
ఏ విధంగా అని చూడాలి ..
కన్నీళ్ళు తుడిచే నీ మనసు పెట్టె కన్నీళ్లను
ఏమని ఓదార్చి తుడవాలి
ప్రేయసి విరహం తో రగిలిపోతున్న నా మనసు
తనను మరచి నీతో కలసి నడవలేదని
ఎలా అని చెప్పాలి ...నేస్తమా
పారే నదికి మరల పాతనీరు రాకపోవోచ్చు
ఎండిన తరువుకి మరల పాత చిగుర్లు మొలవక పోచ్చు
ఎగిరే తుమ్మెద ఒకే పుష్పం పై నిలువకా పోవొచ్చు ..కాని
రెక్కలు లేని తుమ్మెద నా మనసు
వాడిపోని తరువు నా మనసు
ముందుకు సాగలేని ప్రవాహం నా మనసు
తన తోడుకు ఏనాడో అంకితమైపోయింది
ప్రేమికుల రోజు
ఉహలకు అందని ఉహా లోకాలను
ఉహలలోనే దాచుకొని..
ఆ ఉహలలో ఉసులను
నాముందు కదలాడే
నీ ఉహాల రూపంతో పంచుకొని
యద లోపలే నీ జ్ఞాపకాల లోగిలిలో
దాగుడుమూతలు ఆడుకొంటూ
నీ తలపులతో సహజీవనం సాగిస్తున్న నా మది
నేడైనా నా మనసు తెలేపేనా...
కరగని కన్నీటి వ్యధ
కన్నీటి చుక్క విలువ తెలుయునా ..
మమకారం లేని హృదయానికి
మనసు చెప్పే వేదన అర్ధమౌనా ...
ఏడ్చి ఏడ్చి కన్నీరు నదిలా పారాలే తప్ప
తలచి తలచి గుండె ఎడారై పోవాలె తప్ప
ఆగక, నిలువక
నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...
-
కంచికి చేరని కధైపోయింది నా జీవితం సాగరాన్ని చేరని నధైపోయింది నా గమ్యం పువ్వుని చేరని తుమ్మధైపోయింది నా ప్రణయం వెలుగే చేరని చోటైపోయి...
-
రాలిపోయాననుకొన్నాను వాడిపోతాననుకొన్నాను ఇక రెక్కలు ఉడి గాలికి ఎగిరిపోతాననుకొన్నాను కాని నీ అందమైన చేతికి దొరకి నిశిరాతిరిని తలపించే నీ ...
-
నేనొక చంద్రున్నని, అందులో నా మనసొక ఆకాశామని నే పలికే పలుకులు చుక్కలని, నే నవ్వే నవ్వులు వాటి వెలుగులని ఆ వెలుగుల్లో నీవు తడిసిపోవాలనే అం...