మాసిపోయిన మనసు మరల మనసు మార్చుకొని
ముసి ముసి నవ్వులను మొహం నిండా అద్దుకొని
మురిపెంగా పిలుస్తుంటే
మదిని మందలించి తనతో ముందడుగు వేయాలా ..
మరచిన గతాన్ని పిలచి దూరంగా పోవాలా
కనురెప్పల చాటున కన్నీళ్ళని దాచుకొని
పలికే పెదాలలో వణుకును నింపుకొని
మారానని మారం చేస్తూ
మదిని మెలికలు పెట్టేస్తున్న తన వ్యధను
మౌనంగా స్వీకరించాలా........
కళ్ళల్లో కన్నీటి నదులను పరిగెత్తించి
గుండెల్లో ఉప్పెనలను రేకెత్తించి
నా మనసుకి చేసిన గాయానికి
బదులు తీర్చుకోనా
నీ కనుపాపల కవ్వింతలు ,చిరుపెదవుల ఉరడింపులు... నీ పాదాల మువ్వల చప్పుళ్ళు ,నీ అడుగుల్లో పంచుకొన్న అభిరుచులు..
Monday, February 15, 2010
Subscribe to:
Post Comments (Atom)
ఆగక, నిలువక
నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...
-
నీవు తీరాన్ని చేరిన కెరటానివా..లేక...ఉరికే కెరటానివా.... సంద్రాన్ని చేరిన జలపాతానివా...పారే సెలఎరువా .. ఒకసారి ఒంటరి నంటావు ..ఒకసారి త...
-
ఎండిపోతున్న వాగుకి, రాలే చినుకులా రాలిపోతున్న పువ్వుకి, వాలే తుమ్మదలా వాలిపోతున్న పొద్దుకి, కురిసే వెన్నెలలా కురుస్తున్న కుండబోత వానకి ,...
-
ఏ మాయచేసావే ..నే చూసే చూపులో ఏ మాయచేసావే ..నే నడిచే దారిలో ఏ మాయచేసావే .....నే పీల్చే గాలిలో ఇంకేమాయచేసావే ..అది చేరే నా గుండెలో.. చూపు న...
No comments:
Post a Comment