Saturday, October 3, 2009

నా యదపుస్తకం

చెలియా ...

నీ అలికిడి యద తలపులకి చేరిన క్షణం లో....

నా యద పుస్తకం లో నీ పరిచయం నుండి

పొందిపరచిన జ్ఞాపకాలను

ఒక్కక్కటి తిరగేస్తూ చదువుతూవుంటే ....


ఒక పేజి ఆనందాన్ని పంచితే ..మరో పేజి విరహాన్ని పెంచుతోంది,

ఒక పేజి ప్రేమను పంచితే ..మరొకటి తాపాన్ని రగిలిస్తోంది,

ఒకటి చిరునవ్వుని నింపితే ..ఇంకొకటి కన్నీళ్లను పెట్టిస్తోంది ..

తిప్పే ప్రతి పేజి కి ఒక గుండె చప్పుడు

చదివే ప్రతి అక్షరానికి ఒక యద భావం

చూసే ప్రతి పదానికి ఒక మౌనరాగం

ఇలా చదువుతున్న ప్రతి అక్షరానికి

మారుతున్న నా యద భావాల సవ్వడిలో

ఏ పేజి లో నిలిచి, నీకోసం ఎదురు చూడాలి

ఏ పేజి లో తలచి, నిను పిలవాలి

మరేపేజి లో నీ దరికి చేరాలి

మరింకే పేజి లో నీ జతగా నిలవాలి...........

Friday, October 2, 2009

ఎందుకు నేస్తమా ...

నేస్తమా ...
ప్రాణమున్న జీవాన్ని నీ కసాయి మనసుతో

నిర్ధక్ష్యనంగా జీవశ్చవాన్ని చేసి

నీ స్నేహమనే పుడమిలో

ప్రేమనే గోతిని తిసి

నీ జ్ఞాపకాలు అనే మట్టిని

నే చేపట్టధలుచుకొన్న చేతులతో పోసి

నీ ఉసులుకోసం ఎదురు చూస్తున్న మనసుని

కసితీరా కప్పెట్టిసావు ...

నిను వలచినందుకా ...లేక

నిరంతరం తలచినందుకా

నిను పిలిచినందుకా... లేక

నిధ్రలోను నిను పలవరిచునందుకా ...

ఎదురుచూపులు

చెలియా ....

నీ మత్తైన కనులను దాచి ఉంచిన ఆ కనురెప్పలు

చిరుసవ్వడితో తెరిచిన సమయం లో

నా యధ సంద్రం లో ఉప్పొంగే తరంగాల అలజడిని

ఏ సముద్ర కెరటం తో పోల్చాలి,

ఆ నడుమోంపుల సోయగాలు చూపిస్తున్న ప్పుడు

నా తనువు లో పెరిగే వేడిని

ఏ అగ్ని పర్వతపు లావాతో పోల్చాలి,

తల తిప్పుకొని ఉన్నావనుకొన్నాను ..కాని

చిరుసందుల్లో

నను గమనిస్తున్నవను కోలేదు,

తలదిచుకు పోతున్నావనుకొన్నాను

నీ మనసు తెరచాటునుండి

నా ఉనికిని చూస్తూన్నావనుకోలేదు,

నీ మనసులో నే ఉన్నానని తెలుసు

ఆ మనసు పిలిచే పిలుపుకోసం నే ఎదురు చూస్తున్నానని తెలుసు

మరి

ఆ సడిని పెంచే దాగుడు మూతలేలా

విరహాని పెంచే ఆ పరుగు లేలా

అడ్డుగా నిలిచే నీ తెరచాటుని చీల్చుకొనే

రావేలా .............

చివరి క్షణం లో

ప్రియా

నీ జ్ఞాపకాల్ని గాలిలో నింపి

శ్వాసగా పీలిస్తున్న నా ఉపిరి ఆగిపోయినపుడు,

నీ రూపాన్ని రెప్పల చాటున దాచి

ప్రతి క్షణం నిన్నే చూసే నా కనులు మూతబడినపుడు,

నీ జత కోసం తపిస్తూ

భువి పై నిలిచియున్న నా ఆయువు తిరినపుడు ..

నీ రూపాన్ని చేరిపెస్తానంటుంది నా మనసు .

నీ జ్ఞాపకాల్ని తుదిచేస్తానంటుంది నా మనసు...

కరగని నీ జ్ఞాపకాలు

ప్రియా..........

కాలమంతా కరుగుతున్న

నీ యధజ్ఞాపకాలు కరగలేదు,

లోకమంతా మారుతున్న

నీ ప్రేమయాతనలు మారలేదు,

ఎందుకో కలిసాం..మరెందుకో స్నేహితులయ్యం..

తెలియని దారులమధ్య జంటగా నడిచాం,

తలవని సందర్భం లో ఏకమయ్యాం ,

ఉహించని మలుపులో వేరైపోయాం ..అందుకే..

కరిగిపోతున్న కాలానికి ఒక ప్రశ్న వేయాలి

నా ప్రేమను నీలో కలుపుకొని ఎందుకు కరిగించావని

మారుతున్న లోకానికి ఒక ప్రశ్న వేయాలి

వలచిన నా చెలి మనసుని ఎందుకు మార్చావని...

దారి చూపే పుడమిని ఒక సంశయం తెలపాలి

కలసిన దారులను ఎందుకు వేరుచేసావని .....

వీచే గాలికి ఒక ప్రశ్న వేయాలి

పంచుకొన్న భావాల దిశను ఎందుకు మార్చావని ...

ఐనా...

మీలో ఎవరినని అడగాలి ,ఎప్పుడని అడగాలి ..

మీకు వినడానికి స్రవనాలు లేవు..బదులు చెప్పడానికి నోరు లేదు

కాని..

కలవని బంధాలకు ముడివేస్తారు...

కలసిన మరుక్షణం వేరు చేస్తారు..

నీ చేరువకు

ఏ జన్మకు ఈ పెదాలు నీతో ఉసులు చెప్పుకొనేది
ఏ జన్మకు ఈ చేతులు నీతో కలిసేది
ఏ జన్మకు ఈ పాదాలు నీతో కలసి నడిచేది
మరింకేజన్మకు నా ప్రేమకు బదులు దొరికేది ..చెప్పు .నేస్తమా
ఆ జన్మకు ముందుచ్చే నా ప్రతి జన్మని
నీ చేరువకు చేరువ అవుతాననే ఆశతో
ఆనందంగా అంతమౌతాను .
అంతమైన మరుక్షణం ..నీ తలపుతో
మరుజన్మకు తలుపు తడతాను ..
ఆ తలుపు నీ యధాలోపలకి చేరువ అయ్యేంతవరకు
తడుతూనే ఉంటాను

ఓదార్పు

ప్రియా...

కళ్ళల్లో కదలాడుతున్నావు

యదలోని నిదురిస్తున్నావు

నడిచేదారుల్లో ఎదురు పడుతున్నావు

పీల్చే గాలిలో నీ ఆలోచనలను నింపుతున్నావు ...కాని

కొంచమైనా జాలి లేక ,ఏ మాత్రం కరుణ లేక

కదిలే ఆ కళ్ళలో

కదలాడుతున్న కన్నీటిని తుడవలేకపోతున్నావా

నిదురించే ఎదలో మెదులుతున్న భాధకు

ఓధార్పు ఇవ్వలేకపోతున్నావా

ఎదుట పడే ఆ దారుల్లో ఒంటరి గా నడుస్తున్న

నా పాదాలకు తోడు రాలేకపోతున్నావా

అనుక్షణం

కరగని ప్రేమతో ..

చెరగని చిరునవ్వుతో ...

మరచిపోలేని ఉసులతో,

తరిగిపోలేని జ్ఞాపకాలతో,

యధ లోని చిరు దీపం వెలిగించి,

ఆ వెలుగులో ప్రేమను పంచి,

నీడ కూడా వెంటరాని చీకటిలో,

తోడులేని ఒంటరి తనం తో ,

గమ్యం లేని ప్రయాణం చేస్తున్న మనసుకి

ఓధార్పు వయ్యవు

ఆ ఒధార్పులో నీ చిరునవ్వుని

నా పెదాలకు పరిచయం చేసి

వలపువయ్యావు....... ఆ వలపులో

నీ తలపులే నింపావు

ఆ తలపులను ..... నిను చూసిన ప్రతి క్షణం,

నిను తలచిన ప్రతి నిమిషం

నీ ముందు పరచాలని నా మనసు ....అనుక్షణం

ఉభలాట పడుతూ తపిస్తోంది.....సఖియా-

ఎలా గడపాలి

ప్రియతమా ...

నడిచే ప్రతి అడుగుకి.... నీ తలపుని

చూసే ప్రతి చూపుకి...... నీ రూపాన్ని

వినే ప్రతి మాటకీ .......... నీ నామాన్ని

తలచేలా చేసి , వాటికి బానిసగా నన్ను చేసి

నా తనువులో ప్రతి అణువును

నీ అధీనంలో ఉంచుకొని

అవయువాలున్న అవిటివాడిని చేసావు,

ఇప్పుడు నా మనసుకి, ఏ దారిలో నడవాలో తెలియదు .........

నీ తలపు లేకుండా

ఏ విధంగా మాట్లాడాలో తెలియదు ...

నీ ధ్యానం దరిచేరకుండా

ఏ వైపు చూడాలో తెలియదు.............

నీ రూపు కనిపించకుండా

ఎలా గడపాలో తెలియదు ..నీ నామాన్ని పిలువకుండా

ఆగక, నిలువక

నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...