ఉగ్రవాదం పై నిప్పులు కక్కే కనులు,
మూర్కత్వపు చర్యకు మూతబడిపోయాయి
కొండలను పిండి చేసే గుండెలు ,
కసాయితనానికి కడతేరిపోయాయి
అడివితల్లి ఎర్రబారింది,
పుడమితల్లి నెత్తుటోరింది ,చివరకు
కన్నతల్లికి కడుపుకోత మిగిలింది ,
దేశానికి గుండె మండిపోయింది .
త్యాగానికి అర్ధం చెప్పే సైనికులారా
అమ్మ గర్భం రక్షణ నుండి ఏడుస్తూ పుట్టి ,
బంధాలకు బయట నిలిచి , సుఖానికి స్వస్తి చెప్పి
దేశ రక్షణకు కై యుద్దరంగంలో అడుగుపెట్టి ,
పుడమి గర్భంలోకి ఏడిపిస్తూ చేరిపోయారు
మీ ఋణం తీరేనా మా శ్రద్ధాంజలి తో
మీ సేవకు సరితూగునా మా రాల్చే కన్నీటాంజలి తో.
మందుపాతర ఉప్పెనలో, తుపాకీ గుళ్ళ వర్షంలో,
అసువులుబాసిన వీర జవానులకు ఇవే మా అంతిమ వీడ్కోలు..