Thursday, April 8, 2010

నా జీవత గాలిపటం

రూపులేని ఆకారానికి రూపునిచ్చి,
ఆ రూపుకి నీ చేతనైన రంగులు దిద్ది
అవదిలేని ఆశలతో , ఉత్సాహపు హోరుగాలిలో
ఉహకందని శిఖరాలకు, నమ్మశక్యం లేని అంచులకు
నా గమనజివితపు గాలిపటాన్ని ఎగురవేసావు
నేడు నీకు అందని దూరాలకు ఎగిరిపోయానని,
ఈ జన్మకు నీ దరికి రానేరానని భావించి
కన్నీళ్ళ తడి ఎండిన కళ్ళతో,
యద చప్పుడు కూడా భాదిస్తుందన్న భావాలతో
సడి చప్పుడు లేకుండా,కనీసం నను చూడకుండా
చిరునామాలేని చోటులకు ఒంటరిగా దారులు వెతుకుతున్నావు

ఏకాకిలా మిగిలిపోవడానికి ఏకాంతగా దారులు వెతికే ఆ మనసుకి
ఒక్కసారి ఏకాంతగా ఒక ప్రశ్న అడుగు చెలియా
ఎగురవేసిన ఆ గాలిపటపు గుండె దారం ఎవరి కరం లో ఉందని,
అది విడిస్తే దాని బతుకు ఏమౌతుందని,
చివరకు తనకు ఏమి మిగులుతుందని ...

2 comments:

  1. వామ్మో. ఏంటిదీ. నాకేమైంది. ఉన్నట్టుండి భద్రంకొడుకో నా కొడుకో కొంరన్న జర పైలం కోడుకో అని గద్దరన్నలెక్క పాడాలనిపిస్తున్నది. పాడెకవిత అంటే ఇదే.

    ReplyDelete

ఆగక, నిలువక

నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...