Tuesday, March 30, 2010

నీ తోడే లేనపుడు

కాంతులను వెదజల్లని నాడు, వెన్నెలకు పున్నమి ఎందుకు
రాగాలను పలకలేనినాడు, కోయిలకు వసంతాలెందుకు
సువాసనలు విరజిమ్మనపుడు , పువ్వుకి ఆ రంగులెందుకు
నీ తోడే నాకు లేనపుడు ఈ జన్మకు బ్రతుకెందుకు.
కదిలిపోని జీవితం అమావాస్య చంద్రుడిలాగ
రాలి పోనీ జీవితం వాడి పోయే పువ్వులాగ ......

ఈ జన్మకు


నేనొక చంద్రున్నని, అందులో నా మనసొక ఆకాశామని
నే పలికే పలుకులు చుక్కలని, నే నవ్వే నవ్వులు వాటి వెలుగులని
ఆ వెలుగుల్లో నీవు తడిసిపోవాలనే అందమైన పలుకులు పలికి,
మనసులోతుల్లో ఆరని ప్రేమజ్యోతులను వెలిగించావు
నేడు ఆ జ్యోతులు నను నిలువునా కాల్చివేసినా
లేక నను నిలువునా మసిచేసినా
వాటి వెలుగుల్లో నీ నిలువెత్తు రూపం నాట్యం చేస్తూ మురిసిపోతుంటే
ఆ మురిపెంతో ని చిరు పెదవులపై ముసి ముసి నవ్వులు తాండవిస్తుంటే
చాలదా ఈ జన్మకు జీవితం
చాలదా ఈ జన్మకు దానిలో కలిగిన ఆనందం
చాలదా ఈ జన్మకు ఆ ఆనందం లో కలిగిన పరవశం
చాలదా ఈ జన్మకు కారణమైన ఆ నా ఒక్క క్షణం

Monday, March 29, 2010

ఇంద్రియాలు లేని మనసు

నా తనువులో వున్న పంచేంద్రియాలు
అవి చూసే చూపు బట్టి, వినే మాటలను బట్టి
తాకే స్పర్శను బట్టి, పీల్చే వాసను బట్టి
నడిచే నడతను బట్టి, చేసే చేతలను బట్టి
తేడాలను కనిపెట్టి, నా గమనాన్ని నిర్ధేశించగలవు ,
కాని
నిను వలచిన నామనసుకి ఈ తేడాలు తెలియదు ప్రియా ..దానికి
ఉక్రోశంతో కోపాన్ని చూపించినా,ఉల్లాసంతో తీయని మాటలు వినిపించినా
ఉద్రేకంతో నిలువునా అగ్నికి దహన మిచ్చినా,
వెచ్చని ఉపిరిలను యదపైకి ప్రవహింపచేసినా,
చేతిలో చేయి పట్టి ఉన్నత మార్గాలకు నడిపించినా
ఆ దారిలో ముల్లదారిని పట్టించినా
ప్రేమిచడం తప్ప ఏమి చేయలేని
మూగది, చెవిటిది
గుడ్డిది ,కదలలేని అవిటది................................

ఎప్పుడు ఏమౌనో

రోజుకొకసారి రగిలే ప్రళయాగ్నులు నీకు తెలుసా
గంటకొకసారి పుట్టుకొచ్చే చల్లని మంచు పర్వతాలు తెలుసా
నిమిషానికి ఒకసారి విరబుసే పుష్పాలు నీకు తెలుసా
అర క్షణానికే వాడిపోయే సువాసనలు తెలుసా
ఇవన్ని కలసి ఒకే చోట జరిగే ఆ చోటు తెలుసా
ఆ చోటు నా మదిలో నిక్షిప్తమైతే
అది పడే బాధ తెలుసా
ఆనందానికి కారణం వుండదు ,బాధకు కారణం వుండదు
నవ్వుకి కారణం వుండదు , కారే కన్నిటికి కారణం వుండదు
ఇలా ఏ కారణం లేకుండా సాగే జీవితాన్ని
కారణం లేకుండా నా జీవితానికి ఆపాదించి
కనిపించని దూరాలకు కానరాకుండా కనుమరుగైపోయావు
ఎలా ప్రియా నన్ను నేను మార్చుకోనేది
ఎలా నిన్ను మరచిపోయేది

ఏదైతే ఏంటి


నడుస్తున్న కాలం
వసంతమైతే ఏంటి, ,గ్రీష్మం ఐతే ఏంటి
గడుస్తున్న సమయం
పగలైతే ఏంటి, రాత్రైతే ఏంటి
వెళ్తున్న దారుల్లో
ముల్లకంపలుంటే ఏంటి, తివాచీలు పరిస్తే ఏంటి
నిలచున్న చోటులో
శ్మశానాలు వుంటే ఏంటి ,పచ్చని పైర్లుంటే ఏంటి
నా మనసుకు నచ్చిన చెలి నా తోడుని కోరి
నా జన్మకు నీడగా వచ్చి చేరాక....జీవితం
వసంతమవదా ప్రతి కాలం
వెన్నెలలు కురియవా ప్రతిసమయం
పూల పరదాలు పరచదా ప్రతి దారి
ఉద్యానవనాలు కావా ప్రతి చోటు

గుండె బారం

నీ తోడుగా జరిగిన ప్రతి సన్నివేశం
కలగా నీ యదలో సడిచేసినపుడు మురిసే పెదాలకు
ఇలగా నీ ఎదుట నిలచినపుడు మౌనాలేందుకు
నా జతగా గతంలో చేసిన అల్లర్లను
నీ నడిచే దారుల్లో జ్ఞాపకాలుగా ఎదురుపడినపుడు కలిగే పరవశం
నేడు తోడు గా పిలుస్తుంటే రావెందుకు
కలలో వున్న తీపిని ఇలకు నింపవెందుకు ప్రియా
జ్ఞాపకాలలో కలిగిన హాయిని ,నడిచే కాలంలో కురిపించవెందుకు ప్రియా
కల ఏమైనా కలుపుతుందా
గురుతులేమైనా గుండె బారాన్ని దింపుతాయా
జతగా నే పిలుస్తుండగా

సంకోచం

ఏ కూసే కోయలకు తెలియదు
తనను అనుసరిస్తూ సాగిన మన గీతాలు
ఏ పూసే వసంత పూతోటకు తెలియదు
ఒంటరిగా వెళ్లి జంటగా చేసిన చిలిపి అల్లర్లు
ఏ పారే సెలయేటికి తెలియదు
మనం కలసి చేసిన జలకాలాటలు
ఏ చీకటి రేయికి తెలియదు
పరవశం తో పంచుకొన్న అభిరుచులు
ఇక నాతో చెప్పిస్తావేల ప్రియా

Saturday, March 27, 2010

భాషరాక

భాష రాక బావాలు చెప్పలేని
నా మనసులోని ఆశలు అడియాసలు గానే మిగిలి
అంతమౌతున్నాయి
భాష నేర్పేదెవరు, దాని భాద వినేదెవరు
ఆశలకు శ్వాసనిచ్చేదెవరు, వాటికి జీవం పోసేదేవరు

Friday, March 26, 2010

కాలం.

పరిచయం చేసిన కాలానికి ప్రాధేయపడి మరి ప్రార్ధించాను
నా నీడకు జోడుగా తోడైన తనను వేరుచేయ్యోద్దని
నా మాట వినలేదు
చీకట్లను పిలిచావు ,నీడను మాయం చేసావు
కన్నీళ్లను రప్పించావు,గుండెకు కోతను మిగిల్చావు
దూరమైన చెలిని చేరే దారులను దరిదాపుల్లోకి రానివ్వోద్దని దాసీ లా అడిగాను
నను లెక్క చేయలేదు,
గాలాన్ని వేసావు ,గమనాన్ని మార్చావు
శిధిలమైపోయిన చిరునవ్వులకు చిరు ఆశలను కల్పించావు........
ఏమిటి మాయ ,
నీ ఆటకు మే పావులామేనా ,నీ చేతిలో మే కిలుబోమ్మలమేనా

Thursday, March 25, 2010

హృదయ స్పందన.

పూసే పువ్వుకి తెలుసు తన జీవితకాలం కొన్ని గడియలని
కాని పూయడం మానునా
కాసే వెన్నెలకు తెలుసు తన పూర్ణ బింబం కనిపించేది ఒక రాత్రని
కాని కాంతిని వెధజల్లుట మానునా
దూరమైన నా మనసుకి తెలుసు,నీవు తన దరికి చేరవని
కాని నిను తలవడం మానునా
మరచిపోవాలని మనసులోవున్నా
ఆ ప్రేమకు మసిపుయాలని ఆలోచన వున్నా
నీ తలపులతో అవితధైపోయిన నా హృదయం
ఆ పిలుపులకు స్పందనివ్వకుంటోంది

ఎలా మాపాలి

నీ గత స్నేహపు లోతులనుండి పుట్టుకొస్తున స్వప్నాలు
నా కను రెప్పలను వాలనియకుండా
వాలిన వాటిని నిలువనియకుండా
సున్నితమైన నా మదికోలువలో
ఆగని అలజడులను రేపుతూ
నిదురలేని రాత్రులను మిగుల్చుతున్నాయి
ఎలా మాపాలి నీతో నా గతాన్ని
ఎలా ఆపాలి ఆ జ్ఞాపకాల స్వప్నాల్ని

పేజీలు లేని పుస్తకం.

ఒకరిని ప్రేమిస్తున్నాననే భ్రమతో వెంటపడ్డాను .
ఒకరు ప్రేమిస్తారని ఆశతో తోడు నడిచాను
వేరొకరు ప్రేమిస్తున్నారని భయంతో దూరమౌతున్నాను
భ్రమతో మొదలైన నా ప్రేమ భయానికి చేరువై
చివరకి పేజీలు లేని పుస్తకమై
అందులో ఏమిరాసుకోలేని చేతకానివాడినీ చేసి
మానని గాయం చేసి నిలచింది

అద్దం

నీ చేరువతో
నా హృదయపుతద్ధంలో నీ రూపుని ఒకటే నిలిపినా
అది ఏనాడు కన్నిటికి కారణం కాలేదు.
నీ ఎడబాటుతో అది పగిలి
అందులో నీరూపాలను ఎన్ని కొలువుంచినా
అది ఈనాడు కన్నీటిని తుడవటం లేదు

తడబాటు...

నీవు చూసే చూపుల తాకిడికి బలమెంత ,
ఆ తాకిడి నను తాకిన మరుక్షణం లో , నే చూసేసరికి ,
నీ చూపుల దిశలను మార్చిన వేగమెంత ...
తడబాటులేల ప్రియ నీ ఎడబాటును కోరుకున్ననా,
చేరువకు దరిచేరవేల చెలియా,కాదని నిన్ను పొమ్మన్నాన

Wednesday, March 24, 2010

శ్రీరామ నవమి.

ఆకాశానికి రూపాన్ని ఇచ్చే వేళ ,
ఆ రూపానికి రెండు నెలవంకలను అద్దిన వేళ,
అద్దిన ఆ రూపానికి సూర్య కాంతులు
తేజస్సుని ఇచ్చిన వేళ,
ఆ తేజస్సుకి ముగ్ధమై
ఇంద్రధనస్సు దరిచేరిన వేళ,
ముక్కోటి దేవతల సాక్షిగా ,
వర్షాన్ని ప్రతిబింబెంచేలా , పూలవర్షం కురిసిన వేళ,
ఆ రూపం శ్రిరాముడిగా అవతరించిన వేళ ...........
మీకు ,మీ కుటుంబ సభ్యులకు
శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెబుతూ........

ఇక్కడ
ఆకాశం అతని నీలి వర్ణపు మేను ఛాయకు,
నెలవంకలు అతని దివ్యమైన కనులకు ,
సూర్య కాంతులు అతని తేజస్సుకి ,
ఇంద్రదనస్సు అతని విల్లుకి, ప్రతీకలు ,,,,,,,,,, .

కొత్తలోకం.


ఎండమావిలో వర్షపు బిందువులు
నా జీవితంలో నీ పరిచయాలు
గ్రీష్మంలో కోయిల రాగాలు
నా ముందు మెదలాడే నీ పెదాల పలుకులు
అమావాస్యలో వెన్నెల కాంతులు
నా కళ్ళల్లో కదలాడే నీ రూపురేఖలు
ఎడారిలో సముద్రపవనాలు
నా హృదయం లో నీపై కలిగిన ప్రేమభావాలు
ఎందుకంటే
నీ పరిచయం మునుపు..
నా జీవితం ఒక ఎండమావి,
నే నడిచే మార్గాలు చీకటి ఎడారులు..

నా పయనం .

ఎండిపోయిన ఆకునైపోయాను చెలియా
కదిలే కాలానికి ఇక నా బాషలో విలువేముంది.
కదలలేను,మెదలలేను,
కనీసం ఒక అడుగు ముందుకు వేయలేను.........
నీ మనసు లోతుల్లో దాచిపెట్టి
వీయకుండా ఆపిన ప్రేమపవనాలు వీస్తే తప్ప.....
అవి వీచేదెపుడు ,వాటిలో తడిసేదేపుడు
తడిసి వాటితో కలిసేదెపుడు,
కలసి చివరివరకు సాగేదేపుడు..........

Saturday, March 20, 2010

అమ్మ.

పరిచయం లేని పడుచు ,పదినిమిషాల పరిచయంతో పిలచి
తన మదిని అర్పించానని పలికితే
పది కాలపాటు పచ్చగా ఉండాలని
ప్రతిక్షణం పరితపించే పాలిచ్చిన తల్లికి
పాశానికి బలిచేయుట న్యాయమా...............
గులాబి పువ్వు చేతపట్టుకొని
గుండెల్లో గుప్పెడు ప్రేమను నింపుకొని
వడి వడి పాదాల అడుగులతో ,అలుపులేని భావాలతో
గువ్వను చేరిన గోరింకా ......
వడితో చెలిని చేరిన పాదాలను అడుగు
మొదటి అడుగు ఎవరు నేర్పారని,
వలపుతో నీ చెలికోసం పువ్వు పట్టిన చేయినడుగు
తన మొదటి స్పర్శ అనుభూతి ఎవరితో అని,
మెప్పు కోసం చెలితో ఉసులు చెబుతున్న జిహ్వానడుగు
తను మొదట పలికిన మాట ఎవరు నేర్పారని,
నిమిషపు వ్యవధిలో నీ చెలికి అప్పగించిన హృదయాన్ని అడుగు
దానికి చప్పుడు ప్రసాదించిన దేవత ఎవరా అని.

పిలుపు.

పూసే పువ్వు కి తెలుసు తన నిలిచేది కొన్ని గడియలని
కాని వికసించడం మానునా ..
కాసే వెన్నెలకు తెలుసు ,తన పూర్ణ బింబం కనిపించేది ఒక రాత్రని
కాని కాంతిని వెదజల్లుట మానునా
వలచిన నా మనసుకి తెలుసు ,నీవు సరైన జోడివికావని,
కాని తలచుట మానునా..
మరచిపోవాలని వున్నా, నాలో ప్రేమకు మసిపుయాలని వున్నా
నీ తలపులతో అవిటధైపోయిన హృదయం
పిలుపును ఆలకించకుంది ...

Friday, March 19, 2010

ఒకటే ప్రేమ

రాలిన చోటనే మరల చిగురించే ఆకులుండునా
గాయం చేసిన గుండెలోని మరలా మొలకెత్తే ప్రేమ ఉండునా ...............

నీ వోక్కరివే

మొలిచే మొక్కకు పూచే పూలు ఎన్ని వున్నా ...
విరిసే సువాసన ఒకటే కదా
నే రాసే అక్షరాలలో కనిపించే అర్ధాలు ఎన్నివున్నా ,అందులో వున్నది
నే వలచిన నీ ప్రేమొక్కటే కదా

Thursday, March 18, 2010

వీడేదెలా

నువుచేసిన గాయాన్ని మాన్పే మందుందా
నువుకోసిన గొంతుకు రాగాలుపలికే వీలుందా
నీ తలపుని వీడిన నా మనసుందా,నీ ప్రేమని తలవకుండా పీల్చిన నా శ్వాశుందా .....
నా హృదయపు ద్వారపు తలుపులు తెరచి ,
సున్నితమైన మనసుకి కన్నీళ్లను జోడించి,
తేనె పూసిన నాలుకతో కబుర్లను వినిపించి
అలకలతో,నీ ఉలుకులతో
మెలికలతో అందులోని నీ తలుకులతో
నీ జ్ఞాపకాలను పంపించేశావు ..
వెళ్లేదారి మాత్రమే వున్న మనసు నాది,
మరి వాటి దారి మళ్ళించేదెలా ...

Wednesday, March 17, 2010

యాతన

ప్రళయానికి ధీటుగా నిలవగలనేమో
మరణానికి ఎదురుగా పోరాడగలనేమో
సునామిలకు సరితూగగలనేమో,తుపానులకు ఓర్చుకోగలనేమో
కాని ఒక్క క్షణం ...ఒకే ఒక్క క్షణం
అది నీవు గుర్తుకొచ్చే క్షణం
నీ జ్ఞాపకాలు తొలిచే క్షణం
నీ చూపులు నను తడిమే క్షణం ,నీ తలపులు నను చేరే క్షణం
యదచేస్తున్న సడి ని ఆపలేకున్నాను
అది పడే యాతనకు నిలువలేకున్నాను.
మరి .....
ఆ చూపులో ఎన్ని సునామీలో ...
ఆ మాటల్లో ఎన్నితుపానులో..
ఆ నడకల్లో ఎన్ని ప్రళయాలో
ఆ భావాల్లో నను చంపే ఎన్ని అర్ధాలో ...

Tuesday, March 16, 2010

ఉగాది..


విక్రుతికి విరహ గీతం పాడుతూ..
విరోధి కి స్నేహ హస్తాన్ని అందిస్తూ..
రాలేమంచు కురవనంటోంది
పూచే పుష్పం రాలిపోతునదేమోనని..
వేకువజాము చీకటి వెల్లనంటోంది...
కూసే కోయిల గానం ఆగిపోతునదోమోనని..

తెలుగు సమత్సరాది తో..
జీవితపు వసంతపు వాకిట తలుపులు తెరవాలని ఆశిస్తూ ..

Saturday, March 13, 2010

తికమక

నీవు తీరాన్ని చేరిన కెరటానివా..లేక...ఉరికే కెరటానివా....
సంద్రాన్ని చేరిన జలపాతానివా...పారే సెలఎరువా ..
ఒకసారి ఒంటరి నంటావు ..ఒకసారి తోడు కుదిరిపోయినదంటావు
ఒకసారి నా తోడు నంటావు..మరోసారి నిలువనంటావు..
నీ బాషకు అర్ధం తెలియక, నీ నడతను కనుగొనలేక ...
నిను చూసే నా కళ్ళు
కలలకు చేరువై..ఇలను మరచి..
ఎడారిలాంటి నీమనసులో ..
మంచుపర్వతం లాంటి నా ప్రేమ దాగుందని
తలచుకొంటూ మురిసిపోతుంది..

ఏ మాయ చేసావే

ఏ మాయచేసావే ..నే చూసే చూపులో
ఏ మాయచేసావే ..నే నడిచే దారిలో
ఏ మాయచేసావే .....నే పీల్చే గాలిలో
ఇంకేమాయచేసావే ..అది చేరే నా గుండెలో..
చూపు నిను మరువనంటుది...పాదం నీ దారిని విడవనంటుంది ..
శ్వాస నీ ఉపిరికి చేరువౌమంటోంది..హృదయం నీ తలపును విడువనంటోంది

కన్నీటి సంద్రం ..

ఆకలిగా ఉందటే ..
ఆకలి లేని ప్రపంచాన్ని చూపాను ..
బాధగా వుందంటే..
తరగని సంతోషాలను రుచి చూపించాను
జీవితం నిసిరాతిరి కి చేరువ అవుతుందంటే
వెన్నెల వెలుగులకు దారి చూపించాను ////
మరి నన్ను బదులుగా .....................

కన్నిటి సంద్రం లో ముంచడం .....?

అహం..

ఆకాశాన్ని అందుకోన్నానని ...
మెరిసే చుక్కలు ఇక నా సొంతమని
వెలుగునిచ్చే వెన్నెల ఇక నా చెంతేనని
విశాలమైన శూన్యం కి ఇక ఎవరు రాలేరని
అనుకొనే నీ ఉహా ప్రపంచానికి ఒక్కసారి అడుగు....ఈ ప్రశ్న ?

బాధలో నిను ఓదార్చే తోడు ఎవరా అని...

ఇక్కడ చుక్కలు - కోరికలు...వెన్నెల - ఆనందానికి ప్రతీకగా వాడాను

ఆగక, నిలువక

నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...