Thursday, April 8, 2010

నా జీవత గాలిపటం

రూపులేని ఆకారానికి రూపునిచ్చి,
ఆ రూపుకి నీ చేతనైన రంగులు దిద్ది
అవదిలేని ఆశలతో , ఉత్సాహపు హోరుగాలిలో
ఉహకందని శిఖరాలకు, నమ్మశక్యం లేని అంచులకు
నా గమనజివితపు గాలిపటాన్ని ఎగురవేసావు
నేడు నీకు అందని దూరాలకు ఎగిరిపోయానని,
ఈ జన్మకు నీ దరికి రానేరానని భావించి
కన్నీళ్ళ తడి ఎండిన కళ్ళతో,
యద చప్పుడు కూడా భాదిస్తుందన్న భావాలతో
సడి చప్పుడు లేకుండా,కనీసం నను చూడకుండా
చిరునామాలేని చోటులకు ఒంటరిగా దారులు వెతుకుతున్నావు

ఏకాకిలా మిగిలిపోవడానికి ఏకాంతగా దారులు వెతికే ఆ మనసుకి
ఒక్కసారి ఏకాంతగా ఒక ప్రశ్న అడుగు చెలియా
ఎగురవేసిన ఆ గాలిపటపు గుండె దారం ఎవరి కరం లో ఉందని,
అది విడిస్తే దాని బతుకు ఏమౌతుందని,
చివరకు తనకు ఏమి మిగులుతుందని ...

Wednesday, April 7, 2010

నీ ఋణం తీరేనా

ఎండిపోతున్న వాగుకి, రాలే చినుకులా
రాలిపోతున్న పువ్వుకి, వాలే తుమ్మదలా
వాలిపోతున్న పొద్దుకి, కురిసే వెన్నెలలా
కురుస్తున్న కుండబోత వానకి , నీడనిచ్చే గొడుగులా
నా హృదయం లోని ఆనందపుజల్లుని
నిరుత్సాహాపు ఎడారుల మద్య కురిపించి
వాడిపోతున్న ఆశకి వసంతపు పల్లకిని ఎక్కించి
చీకటి తెలియని దారుల్లో, నీ స్నేహమనే నీడతో
ఉహకందని ఉన్నతశిఖరాలకు సాగనంపావు
తీరేనా ఈ జన్మకు నీ ఋణం,కన్నీళ్ళతో నీ పాదాలు కడిగినా
తీరేనా ఈ జన్మకు నీ ఋణం,శిరస్సు వంచి ప్రణామాలు చేసినా ...

కన్నీటాంజలి

ఉగ్రవాదం పై నిప్పులు కక్కే కనులు,
మూర్కత్వపు చర్యకు మూతబడిపోయాయి
కొండలను పిండి చేసే గుండెలు ,
కసాయితనానికి కడతేరిపోయాయి
అడివితల్లి ఎర్రబారింది,
పుడమితల్లి నెత్తుటోరింది ,చివరకు
కన్నతల్లికి కడుపుకోత మిగిలింది ,
దేశానికి గుండె మండిపోయింది .

త్యాగానికి అర్ధం చెప్పే సైనికులారా
అమ్మ గర్భం రక్షణ నుండి ఏడుస్తూ పుట్టి ,
బంధాలకు బయట నిలిచి , సుఖానికి స్వస్తి చెప్పి
దేశ రక్షణకు కై యుద్దరంగంలో అడుగుపెట్టి ,
పుడమి గర్భంలోకి ఏడిపిస్తూ చేరిపోయారు

మీ ఋణం తీరేనా మా శ్రద్ధాంజలి తో
మీ సేవకు సరితూగునా మా రాల్చే కన్నీటాంజలి తో.

మందుపాతర ఉప్పెనలో, తుపాకీ గుళ్ళ వర్షంలో,
అసువులుబాసిన వీర జవానులకు ఇవే మా అంతిమ వీడ్కోలు..

దాగుడు మూతలు

నెలవంక రాకతో
కలువలు కొలనులో దాగిపోవునా,
సూర్యుని సడితో
కమలం సరస్సులో మునుగిపోవున,
తుమ్మెద నీడతో
పుష్పం రేకులు ముడుచుకోనునా,
వసంతం పిలుపుతో
కోయిల గొంతు మూగబోవున,
మరి ఎందుకు నాకీ కొత్త భావన, ఎన్నాళ్లీ వింత వేదన
కనిపిస్తే మాయమౌతావు,కనుమరుగైతే ఎదురుచూస్తావు
పిలిస్తే పారిపోతావు,లేకపోతే ఓర చూపులు విసేరేస్తావు
దాగివున్న ప్రేమతో దాగుడు మూతలేలా
జతకట్టవలసిన జోడితో దోబుచులేలా
నీ రూపాన్ని ఆరాధించే ఆ కళ్ళకు రెప్పవై చేరవేల
నీ కోసమై నిలచివున్న నా గుండెకు చప్పుడై నిలువవేల

Tuesday, April 6, 2010

యదతీరం

సాగర తీరపు అలలు నీ నడకలు కాగ
అవిచేరే గమ్యం నా యదతీరం కాగ
పొంగే నురగలు నీ నవ్వులు కాగ
వాటికి తడసి నీలో నే కరిగిపోగ
వీచే గాలులు నీ ఉపిరిలు కాగ
దానికి మురిసి నా మనసు
పిల్లనగ్రోవియై రాగాలు పలకగా
వచ్చే ఆటుపోటులు నీ కోప తాపాలు కాగ
ఎదురు చెప్పక నే మౌనంగా నిలువగ
పున్నమి లో నీవు పరవశించి నాట్యం చేయగ
ఆ మత్తులో నన్ను నే మై మరచిపోగా
సాగిపోని ఈ జీవితం నీ నీడలో కడదాక
నిలచిపోని బంధం మన ఉనికి ఉన్నంతదాక

Sunday, April 4, 2010

అమ్మ నాన్న

రెండు జతల కళ్ళు కాని
చూసే ప్రపంచం రెండు కళ్ళతోనే
రెండు గుండెల చప్పుడు కాని
నిలిచేది ఒక గుండె చప్పుడు తోనే
ఎందరో ఆత్మీయులు కాని
ప్రాణం నిలుపుకోన్నది ఒక బంధం కోసమే
సామెతలుగా వున్న ఈ పదాలను
ఒక్కసారి మనసుకు అడుగు నేస్తమా ...
కన్నీళ్ళు తిరిగే కళ్ళతో ,
వణుకుతున్న పెదాలతో చెబుతుంది
సప్తస్వరాలు ముందు నిలిచి గానం చేసినా
కోటి రాగాలు చూసేది నీ పిలుపులోనే అని
దివిని భువిని కలిపేస్తూ
కనులకి పట్టని అందాలు ఎన్ని నిలచినా
ఆనందం కలిగేది నీ రూపుతోనే అని
పంచభక్ష పరమాన్నాళ్ళు ఎన్ని ముందు పెట్టినా
కడుపునిండేది నీ ఆరగింపుతోనే అని
వారు మన అమ్మ నాన్న అని
వాళ్ళ ప్రపంచం మనమే అని.

ఆగక, నిలువక

నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...