Monday, August 31, 2009

నిరీక్షణ

నీ హృదయాన్ని చేరని బావాలు

నీ కళ్ళకు కనిపించని కన్నీళ్ళు

నిను ధరిచేరలేని నా పాదాల అడుగులు

.నీ స్పర్శకు నోచుకోని గాడమైన ఉపిరిలు

నా లోలోపల నిలువలేక ...

తేరాన్ని చేరని కెరటాలు లాగా

తుమ్మద స్పర్శకు ను నోచుకోని మొక్క లాగ

జాబిలి నిడకు నోచుకోని పువ్వులాగ.

మధన పడుతూ....

ప్రతి క్షణం నీ తలపుల్లోనే ఉంటూ ....

నడిచే కాలాన్నీ మరిచిపోతున్నాయి .

నిను చేరలేని అవి...నా హృదయం లో నీ రూపాన్ని నిలుపుకొని

నీ కాటుక కాళ్ళ చూపులుకోసం ఎదురుచూస్తున్నాయి

నీ పాదాల అడుగుల జాడ కోసం నిరీక్షిస్తున్నాయి

Friday, August 14, 2009

విముక్తి


నిద్దర మరిచారు కానీ కలలు కన్నారు
తిండిని మరిచారు కానీ కడుపు నిండా ఆశను నింపుకొన్నారు
తల్లి తండ్రి ని మరిచారు ,కట్టుకొన్న వారిని మరిచారు
పుట్టిన పిల్లలను మరిచారు ,బంధు భంధవ్యలకు దూరంగా ఉన్నారు
కానీ జీవిత గమ్యం మరువలేదు ,
తమ ఉపిరి లో ప్రతీ గాలికనాన్ని నిప్పు కనికగా మార్చి
పగలనక రేయి అనకా ,ఎండనక వాన అనకా
కోట్ల భారతీయుల ముఖం లో చిరు నవ్వు నిలిపే రోజు కోసం
తెల్ల వాడి పాదాల మధ్య నలిగిపొయినా ,
ఆ నలిగిన పదాలమధ్య రక్తం ఏరులై పారినా
వాడి కసాయి తత్వానికి బలైపోయిన
పోరాటాన్ని ఆపలేదు ....
అలా .
మండే సూర్యుని అగ్ని జ్వాలలను ఉపిరిలో నింపుకొని
సింహం లోని ధీరత్వాన్ని నరనరల్లోని ఆకళింపు చేసుకొని
బానిస బ్రతుకు నుంచి స్వేచ్చను ప్రసాదించిన
స్వతంత్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ

మారిపోయిన మనసు

ప్రేమతో చూడమన్నాను ,కనురెప్పలు భారమన్నావు

చిరునవ్వుతో మాట్లాడమన్నాను పెదవులు పలకలేవన్నావు

జంటగా నడవమన్నాను పాదాలు కధలలేవన్నావు

ఏమైంది నేస్తమా
కనురెప్పలు ఆర్పకుండా చూసే ఆ కనులు నను ఎలామరిచాయి

ప్రతి క్షణం నా పేరే తలిచే ఆ పెదవులు ఎలా మూగబోయాయి

నను వెతుకు కుంటూ నడిచే ఆ పాదాలు ఎలా దారి తప్పాయి

తెలుపు నేస్తమా

నను చూసే కళ్ళలో కన్నీటి కి కారణం అయ్యానా

నను తలిచే ఆ మనసుకు బాధపెట్టానా

నను వలచిన హృదయాన్ని గాయపరిచానా

నీ సమాధానం కోసం ఎదురుచూస్తూ .............నీ

వలపు

నేస్తమా

అందమైన పరిచయాన్ని మరిచిపోమ్మన్నావు

ఆ పరిచయం లో పంచుకొన్న భావాలను మరిచిపోమ్మన్నావు

కలసిన ఆ భావాలతో పెంచుకొన్న ప్రేమనూ మరిచిపోమ్మన్నావు

ఆ ప్రేమ లో పెంచుకొన్న ఆశలు ,

ఆ ఆశలతో నింపుకొన్న నా కలలు ను తుడిచివేయమన్నావు ...

కానీ .నేస్తమా

అందంగా పంచుకోన్న భావాలను మరిచిపోగలను ..కాని

అవి పలికిన పెదాలు నిను పిలువకుండా ఉండగలవా

ఆశలతో నింపుకొన్న కళలను మరచిపోగలను ..కాని .

అవి కన్న కనులు నిన్ను మరచిపోగాలవా

యదా నిండా పెంచుకొన్న ప్రేమను మరిచి పోగలను ..కాని

ఆ ప్రేమతో పొందిన పరవశాన్ని ,

ఆ పరవశం లో పొందిన ఆనందాన్ని

వలచిన నా హృదయం మరచిపోగాలదా ..ఇన

మరపు అనే భావం నీలో వున్నపుడు నన్నే ఎందు కు వలచావు

వలచిన నీవు ..నన్ను తలిచేటట్లు ఎందుకు చేసావు

చెప్పు నేస్తమా ..నను చూసి చెప్పు నేస్తమా ..

ఏమి

ఉషులు చెప్పిన ఆ పెదాలు పలకనంటున్నయా

భావాలతో పలికే ఆ కనులు నన్ను చూడనంటున్నయా

మరి వలచిన నా హృదయానికి నేను ఏమని సమాధానం చేప్పాలి

,

Thursday, August 13, 2009

నేస్తం

నేస్తమా
కాలం ఎంత కటినమైనది ..
అది నన్ను నీ దరి కి చేరకుండా చేసింది
ఏమ్చేయగలం ......నేస్తమా
నీవు నడిచే దారిలో ప్రతి మనిసి లోను నన్ను చూసుకో
పీల్చే ప్రతి గాలి రేణువు లోను నన్ను తలచు కో
త్రాగే ప్రతి నీటి బొట్టు లోని నన్ను కలుపుకొ
మాట్లాడే ప్రతి మాటలోనూ నన్ను పిలుచు కో
ఐనా
నా రూపం కనిపించుట లేదా ..... ఐతే
యధ నిండా నా ఆలోచనలను నింపుకొని నిదురించు నేస్తమా ....
నీ కళ్ళలో కలనై ...వస్తా
కలలో మనస్పూర్తిగా కలుసుకొందాం
ఆకాశం చివరల దాక
భూదేవి అంచులు దాక విహరిద్దాం
వీచే ప్రతి గాలి రేనువుకి మన పరిచయాన్ని చెబుదాం
త్రాగే ప్రతి నీటి బొట్టులోని మనపేరు రాసు కొందాం
మండే ప్రతి అగ్ని కణాన్ని ని సాక్షి గా నిలుపుదాం
అలా పంచ భూతాలను మన స్నేహం లో కలుపుకొందాం

ఆగక, నిలువక

నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...