Wednesday, July 29, 2009

మరచిపో......


మనసా ....

మరచిపో ..

మరచిపో ........ మరచిపో

మరచిపో .. మరచిపో .. మరచిపో ...

.............................................

ఎన్నిసార్లు

ఇంకా ఎన్నిసార్లు ...నీకు చెప్పను

తనను మరచిపోమ్మని ....

అందంగా ఉండే ఆమె పెదవుల కదలికలు నీకు నచ్చివుండోచ్చు

కానీ అవి నీకు సొంతం కాదు ..

మత్తెక్కించే కళ్ళతో చూసే ఆ చూపులు నచ్చి ఉండొచ్చు

కాని అవి నీ వైపు కాదు ...

హోయలోలికే ఆ వయ్యారపు నడక నీ సడిని పెంచొచ్చు

కానీ అవి నీకు కాదు ...

ఏ మాత్రం నీకు సొంతం కాని ,ఆ కాంతను చూసి ఎందుకు ఆ మై మరుపు

ఎందుకా పలవరింపు .

పిలచి పిలచి నీ యధ సవ్వడి లయ తప్పిన

కను రెప్పలు ఎత్తి కనీసం యామరపాటు తో కూడా చూడని ఆమెను

మరచిపో ..... గడచిన కాలం ఒక పీడ కలలాగా

తరలిపో ..... తన జ్ఞాపకాలను అందనంత దూరంగా

నిలిచిపో .... లక్ష్యం కోసం కృషి చేసే సాధకుడి లా ..................

వీడ్కోలు


నేస్తమా......

నా తుది శ్వాస విడిచే చివరి క్షణంలో ????????????


నిత్యం నా ఎదురుగా ఉన్నావని ఉహిస్తూ...

నిన్నే తలిచే నా కనులు మూత పడిపోవోచ్చు,

నీ పేరే ప్రతి క్షణం తలిచిన నా గొంతు ..

ఇక మూగ పోవొచ్చు ,

నీ మాటలనే వినాలని తపించే నా చెవులుకు

ఇక ఏమి వినిపించకపోవోచ్చు

నీకు తోడుగా నిలవాలని తాపత్రయపడే నా చేతులు ..

నీతో కలసి నడవలనుకొన్న నా పాదాలు

మరి కదలలేకపోవోచ్చు

కాని!!!!!!!!!!

వలచిన నా హృదయం నీ కోసం కట్టుకొన్న పొదరిల్లు లో

తలవక మానదు ......

తలచిన నా హృదయం నిను కలువక,

కలసిన నీతో మాట్లాడక మానదు ...........

ఆ మాటల్లో నిను ఈ జన్మలో కలవలేకపోయనని బాదతో

నీ పాదాల చెంత కన్నీరు కార్చి,

నీకు చివరిసారి వీడ్కోలు చెప్పాకా మానదు .........................

Sunday, July 26, 2009

మరుపు


నేస్తమా !!!!
మరచిపోయే మనసు నీది ...........
మరపురాని మనసు నాది....
మారిపోయే మనసు నీది....
పదిలంగా దాచుకొనే స్వభావం నాది.....
నీ మరిచిపోయే స్వభావం తెలియక,
మారిపోయే తత్వం ఎరుంగక,
నిన్నే తలుస్తూ......... నీ కోసమే పరితపిస్తూ........
నీతో కలసి నడచిన అడుగులను మరువలేక ,
ఆ దారుల్లో పంచుకొన్న భావాలను వదలలేక,
అనుక్షణం నరకం అనుభవిస్తూ.........
అందమైన జీవితాన్ని అధ్వాన్నం చేసుకొంటూ..
నీ మరచిన మనసు పిలిచే పలుకుకోసం
మారిపోయిన నీ అంతరం మార్పుకోసం ఎదురుచూస్తూ ........
ఎక్కడ ఉన్నానో, ఎలా వున్నానో,.... తెలియక
నన్ను నేను నిరంతరం ప్రశ్నిన్చుకొంటూన్నాను

విరహం


నేస్తమా ................

నా కనుపాపల అంతరాలనుండి

జారే కన్నీటి బొట్టు కి నోరు లేదు ,

తను జారుతున్నది నీ వల్లనే

అని చెప్పడానికి ....

చిరునవ్వుతో పలకరించే

నా పెదవులకు మాటలు లేవు

తను మూగబోయింది నీ ఉనికిని చూసే

అని తెలపడానికి ................

నిరంతరం నినుతలుస్తూ శబ్దం చేస్తున్న

నా గుండు చప్పుడుకి భాష లేదు

తను తపిస్తున్నది నీ సాంగత్యం కోసమే

అని విన్నవించడానికి .........

సూర్యున్ని చూసి తామర , చంద్రుణ్ణి చూసి కలువ

తేనె పూలను చూసి తుమ్మెద ,వీచే గాలిని చూసి పచ్చని పైరు

ఇలా జీవం లేని ......... ,కనీసం భాష కూడా రానివి .........

తమ ప్రేమలను , తమ భావాలతో తెలుపుతూ వుంటే

జీవం ఉండి కూడా నిర్జివుడునై ,

తెలిపే భాష వుండి మూగవాడినై

ప్రేమించానని చెప్పలేక ,ఎలా తెలపాలో తెలియక

నిరంతరం సతమతమౌతూ పిచ్చివాన్ని అవుతున్నాను ...............

Monday, July 20, 2009

స్వప్నం




స్వప్నం ...క్షణకాలం పాటు ఉండే

అందమైన ఉహ జనీతం
తొలగిన మరు క్షణం కలవరపరిచే

ఒక ఉహ కల్పితం
లేని ఆశ లని మేల్కొల్పుతూ ,ఇలలో లేని స్వర్గాన్ని చూపిస్తుంది..
అలా ఓ అందమైన కలకు సమాదానంగా మిగిలిన వాణ్ణే నేను...
స్వప్నం లో కనిపించిన అందమైన ఆ రూపాన్ని...... .
ఆ రూపానికి రంగులిదిద్దే ఆ చిరునవ్వుని చూసి వలిచాను..
వలచిన నా హృదయం లో తన రూపాన్ని నిలుపుకొన్నాను .
నిలుపుకొన్న ఆ దేవతను ఆరాధించాను ....
ఆరాదిస్తున్నాను.................................

ఆ .. ఆరాధనలో తీయదనం మాటల్లో తెలుపలేనిది

రేయమ్మ ఈ తీయని అనుభూతి కలిగించే ఆ స్వప్నాన్ని కల్పించిన నీకు

ఇవే నా ధన్యవాధాలమ్మ.........................


ఒంటరి


కలత చెందిన నా హృదయం తనను కలవాలని తపించింది
విసుగు చెందిన నా మనసు తనతో ఉ సులు చెప్పమంది
తను ఆప్యాయంగా పలకిరించే చిరునవ్వు ని చూడలని....
శ్రుతి మించిన యధ అలజడు లతో మాట్లడాలని
ఆ మాటలతో యధ కలతను చెరిపెద్దామని ఆశతో
ఉరకలు వేస్తూ వెళ్ళిన నా మనసుకు,మరో గాయం చేసింది
కలతతో ఉన్న నా మనసుకు, ఆమె చేసిన గాయం ...
కళ్లల్లో కనబడని కన్నీళ్ళు నింపింది
హృదయం లో శోకాన్ని పెంచింది....
నేస్తమా........
తోడు వుండవలసిన నీవే ...
హృదయాన్ని వికలం చేసి
ఒంటరి వాణ్ణి చేసావు
ఇది నీకు న్యాయమా ........

ఉహ


కవి ఆలోచలను కలం నిండా నింపి
ఎన్నో ఉహాలను, దృశ్యాలను ఉహించి
మనసారా రాద్దామంటే నా కలం
నీ పేరు రాసి ఆగి పోయింది...............
ఆగిన నా కలం ను కదలమని ఒత్తిడి చేస్తే
నీ రూపాన్ని గీసి మురుసిపాయింది................
ఈ తప్పు కలందా..... వ్రాసిన నాధా.......
లేక వలచిన నా మనసుదా...............
చెప్పు నేస్తమా ...
నిన్ను వలచి మాటరాని ముగావన్నైన నా పై జాలి చూపి సమాధానం చెప్పు
ప్రతిక్షణం నిన్నే తలుస్తున్న నా యధలోతుల్ని గమనించి సమాధానం చెప్పు....
నీ పెదవులనుండి వచ్చే ఆ సమాధానం కోసం ఎదురుస్తూ..............

నీ రాకకై


ఊరిస్తున్న అందాలను ..ఉహల్లో చూపిస్తూ
మనసులో మెదలని కోర్కెలను మేల్కొల్పుతూ
కలలో ఇలలో ఎటుచుసినా ఏమిచేసినా
నీ రూపాన్నినా యదలో మేదిలేల చేసావు
నాటి నుంచి నా మది నీ రాకకోసం పరితపిస్తూ
కుసుమాలను వెదజల్లుతోంది
ఆ జడి లో నీవు తడవాలని
అలా తడిచిన నీ పెదవులపై చిరునవ్వులు చిగురించాలని
ఆశిస్తూ .....................

Sunday, July 19, 2009

తొలిపరిచయం








కల లాగ పరిచయమైన
అందమైన ఆమె పరిచయం ,
ఇలలో తెలియని ఓ ఉహ లోకాన్ని చూపింది,
ఆ లోకంలో .....
చేసేప్రతి పని క్రోత్తదే..
చూసే ప్రతి మార్గం వింతే
అనుభవించే ప్రతి భావం తోలిపరిచయమే
ఇలా ..
తోడు లేని నా జీవితానికి ...
ఉహ కందని లోకాన్ని
పరిచయం చేసి
నా జీవితంలో కొత్త కుసుమాలను
పరిచయం చేసింది






ఆగక, నిలువక

నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...