Thursday, August 13, 2009

నేస్తం

నేస్తమా
కాలం ఎంత కటినమైనది ..
అది నన్ను నీ దరి కి చేరకుండా చేసింది
ఏమ్చేయగలం ......నేస్తమా
నీవు నడిచే దారిలో ప్రతి మనిసి లోను నన్ను చూసుకో
పీల్చే ప్రతి గాలి రేణువు లోను నన్ను తలచు కో
త్రాగే ప్రతి నీటి బొట్టు లోని నన్ను కలుపుకొ
మాట్లాడే ప్రతి మాటలోనూ నన్ను పిలుచు కో
ఐనా
నా రూపం కనిపించుట లేదా ..... ఐతే
యధ నిండా నా ఆలోచనలను నింపుకొని నిదురించు నేస్తమా ....
నీ కళ్ళలో కలనై ...వస్తా
కలలో మనస్పూర్తిగా కలుసుకొందాం
ఆకాశం చివరల దాక
భూదేవి అంచులు దాక విహరిద్దాం
వీచే ప్రతి గాలి రేనువుకి మన పరిచయాన్ని చెబుదాం
త్రాగే ప్రతి నీటి బొట్టులోని మనపేరు రాసు కొందాం
మండే ప్రతి అగ్ని కణాన్ని ని సాక్షి గా నిలుపుదాం
అలా పంచ భూతాలను మన స్నేహం లో కలుపుకొందాం

No comments:

Post a Comment

ఆగక, నిలువక

నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...