Thursday, March 18, 2010

వీడేదెలా

నువుచేసిన గాయాన్ని మాన్పే మందుందా
నువుకోసిన గొంతుకు రాగాలుపలికే వీలుందా
నీ తలపుని వీడిన నా మనసుందా,నీ ప్రేమని తలవకుండా పీల్చిన నా శ్వాశుందా .....
నా హృదయపు ద్వారపు తలుపులు తెరచి ,
సున్నితమైన మనసుకి కన్నీళ్లను జోడించి,
తేనె పూసిన నాలుకతో కబుర్లను వినిపించి
అలకలతో,నీ ఉలుకులతో
మెలికలతో అందులోని నీ తలుకులతో
నీ జ్ఞాపకాలను పంపించేశావు ..
వెళ్లేదారి మాత్రమే వున్న మనసు నాది,
మరి వాటి దారి మళ్ళించేదెలా ...

Wednesday, March 17, 2010

యాతన

ప్రళయానికి ధీటుగా నిలవగలనేమో
మరణానికి ఎదురుగా పోరాడగలనేమో
సునామిలకు సరితూగగలనేమో,తుపానులకు ఓర్చుకోగలనేమో
కాని ఒక్క క్షణం ...ఒకే ఒక్క క్షణం
అది నీవు గుర్తుకొచ్చే క్షణం
నీ జ్ఞాపకాలు తొలిచే క్షణం
నీ చూపులు నను తడిమే క్షణం ,నీ తలపులు నను చేరే క్షణం
యదచేస్తున్న సడి ని ఆపలేకున్నాను
అది పడే యాతనకు నిలువలేకున్నాను.
మరి .....
ఆ చూపులో ఎన్ని సునామీలో ...
ఆ మాటల్లో ఎన్నితుపానులో..
ఆ నడకల్లో ఎన్ని ప్రళయాలో
ఆ భావాల్లో నను చంపే ఎన్ని అర్ధాలో ...

Tuesday, March 16, 2010

ఉగాది..


విక్రుతికి విరహ గీతం పాడుతూ..
విరోధి కి స్నేహ హస్తాన్ని అందిస్తూ..
రాలేమంచు కురవనంటోంది
పూచే పుష్పం రాలిపోతునదేమోనని..
వేకువజాము చీకటి వెల్లనంటోంది...
కూసే కోయిల గానం ఆగిపోతునదోమోనని..

తెలుగు సమత్సరాది తో..
జీవితపు వసంతపు వాకిట తలుపులు తెరవాలని ఆశిస్తూ ..

Saturday, March 13, 2010

తికమక

నీవు తీరాన్ని చేరిన కెరటానివా..లేక...ఉరికే కెరటానివా....
సంద్రాన్ని చేరిన జలపాతానివా...పారే సెలఎరువా ..
ఒకసారి ఒంటరి నంటావు ..ఒకసారి తోడు కుదిరిపోయినదంటావు
ఒకసారి నా తోడు నంటావు..మరోసారి నిలువనంటావు..
నీ బాషకు అర్ధం తెలియక, నీ నడతను కనుగొనలేక ...
నిను చూసే నా కళ్ళు
కలలకు చేరువై..ఇలను మరచి..
ఎడారిలాంటి నీమనసులో ..
మంచుపర్వతం లాంటి నా ప్రేమ దాగుందని
తలచుకొంటూ మురిసిపోతుంది..

ఏ మాయ చేసావే

ఏ మాయచేసావే ..నే చూసే చూపులో
ఏ మాయచేసావే ..నే నడిచే దారిలో
ఏ మాయచేసావే .....నే పీల్చే గాలిలో
ఇంకేమాయచేసావే ..అది చేరే నా గుండెలో..
చూపు నిను మరువనంటుది...పాదం నీ దారిని విడవనంటుంది ..
శ్వాస నీ ఉపిరికి చేరువౌమంటోంది..హృదయం నీ తలపును విడువనంటోంది

కన్నీటి సంద్రం ..

ఆకలిగా ఉందటే ..
ఆకలి లేని ప్రపంచాన్ని చూపాను ..
బాధగా వుందంటే..
తరగని సంతోషాలను రుచి చూపించాను
జీవితం నిసిరాతిరి కి చేరువ అవుతుందంటే
వెన్నెల వెలుగులకు దారి చూపించాను ////
మరి నన్ను బదులుగా .....................

కన్నిటి సంద్రం లో ముంచడం .....?

అహం..

ఆకాశాన్ని అందుకోన్నానని ...
మెరిసే చుక్కలు ఇక నా సొంతమని
వెలుగునిచ్చే వెన్నెల ఇక నా చెంతేనని
విశాలమైన శూన్యం కి ఇక ఎవరు రాలేరని
అనుకొనే నీ ఉహా ప్రపంచానికి ఒక్కసారి అడుగు....ఈ ప్రశ్న ?

బాధలో నిను ఓదార్చే తోడు ఎవరా అని...

ఇక్కడ చుక్కలు - కోరికలు...వెన్నెల - ఆనందానికి ప్రతీకగా వాడాను

ఆగక, నిలువక

నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...