Saturday, March 20, 2010

అమ్మ.

పరిచయం లేని పడుచు ,పదినిమిషాల పరిచయంతో పిలచి
తన మదిని అర్పించానని పలికితే
పది కాలపాటు పచ్చగా ఉండాలని
ప్రతిక్షణం పరితపించే పాలిచ్చిన తల్లికి
పాశానికి బలిచేయుట న్యాయమా...............
గులాబి పువ్వు చేతపట్టుకొని
గుండెల్లో గుప్పెడు ప్రేమను నింపుకొని
వడి వడి పాదాల అడుగులతో ,అలుపులేని భావాలతో
గువ్వను చేరిన గోరింకా ......
వడితో చెలిని చేరిన పాదాలను అడుగు
మొదటి అడుగు ఎవరు నేర్పారని,
వలపుతో నీ చెలికోసం పువ్వు పట్టిన చేయినడుగు
తన మొదటి స్పర్శ అనుభూతి ఎవరితో అని,
మెప్పు కోసం చెలితో ఉసులు చెబుతున్న జిహ్వానడుగు
తను మొదట పలికిన మాట ఎవరు నేర్పారని,
నిమిషపు వ్యవధిలో నీ చెలికి అప్పగించిన హృదయాన్ని అడుగు
దానికి చప్పుడు ప్రసాదించిన దేవత ఎవరా అని.

No comments:

Post a Comment

ఆగక, నిలువక

నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...