నీ కనుపాపల కవ్వింతలు ,చిరుపెదవుల ఉరడింపులు... నీ పాదాల మువ్వల చప్పుళ్ళు ,నీ అడుగుల్లో పంచుకొన్న అభిరుచులు..
Thursday, August 5, 2010
ఉహించగలవా ప్రియా
వాడిపోతాననుకొన్నాను
ఇక రెక్కలు ఉడి గాలికి ఎగిరిపోతాననుకొన్నాను
కాని నీ అందమైన చేతికి దొరకి
నిశిరాతిరిని తలపించే నీ కొప్పులో వెలుగుతాననుకోలేదు
ఆ వెలుగుతో నను చూసే ప్రతి మనసుకి గుచ్చుతాననుకోలేదు
అని నేనిచ్చిన పువ్వే నీతో అంటుంటే ....
నిను వలచిన నా మనసు ఇంకేమంటుందో ఉహించగలవా ప్రియా ...
Friday, July 30, 2010
చెప్పలేక... శిలనై
ఆ బదులకు చప్పుడు చేసే నా గుండెకు
ఆ గుండెలో కట్టిన ప్రేమ గూడు భవితకు
ఆ భవితలో ముడి పడివున్న నా భవితకు భయపడి
చెప్పవలసిన మాట,
చెప్పవలసిన సమయంలో
చెప్పకుండా చాటుగా దాచి
చివరివరకు చెప్పకుండానే
మాటరాని శిలగా మిగిలిపోయాను ప్రియతమా ..
అంతేగాని
చెప్పే ధైర్యం లేక కాదు , నీ శ్వాసకు జీవమై ఉండలేక కాదు ,
నిను తోడుగా చేర్చుకొంధామనే ఆశ లేక కాదు ,
నీ అడుగులకు పాదాలుగా నిలువలేక కాదు
Sunday, July 11, 2010
నేస్తానికి విన్నపం
నా పెదవులపై చిరునవ్వులు వెలుగుతాయని
అవి నా గుండెల్లో ఆనందాన్ని నింపుతాయని
లేనిది వుందని బ్రమపరుస్తూ
ఆ బ్రమలో నాకు జోలపాడుతూ
మరచిపోయిన నా చెలి జ్ఞాపకాలకు చేరువచేస్తూ
నన్ను ఇలకు దూరం చేస్తున్నావు....
చూడు నేస్తమా
నా ప్రియురాలు జ్ఞాపకాలను జ్ఞప్తికి తెప్పించే
ఏ జ్ఞాపకాన్ని నా జ్ఞప్తికి తెప్పించి నా యదముందు పరచినా
అది కన్నీటి సుడే కాని, పన్నిటి తడి కాదు
మానుకో నేస్తమా ...తన ఉనికిని నా ముందు నిలపడం
ఎదురుగా నిలువలేక
యదలో అలజడులు రేపుతాయోమోనని
ఆ రేపే అలజడులు నరనరాల్లో కదలాడి
గుండెను గాయం చేస్తాయోమోనని
గాయపడిన గుండె బాధను ఓర్చుకోలేక
కళ్ళల్లో కన్నీటిని నిమ్పుతున్దేమోనని
ఎదురుపడిన ఎదురుగా నిలువలేక
కనులను నేలకు దించి పోతున్నా ప్రియతమా
పరిణయం
దూరంగా పారిపోవాలనే తపనతో
ఆ పరిచయాలు పంచిన పలకరింపులకు
స్వస్తి చెప్పాలనే ఆరాటం తో
నీ పరిచయం తో పరిచయమైన స్నేహం యొక్క పరిణయానికి
నా పాదాలను ముందుకు కదిపాను ప్రియా
Tuesday, July 6, 2010
ఎదురుచూపులు
సాగరాన్ని చేరని నధైపోయింది నా గమ్యం
పువ్వుని చేరని తుమ్మధైపోయింది నా ప్రణయం
వెలుగే చేరని చోటైపోయింది నా గమనం
ఇక నా కధకు ముగుంపు పలికేదెవరు
నా గమ్యానికి నను చేర్చేదెవరు
నా ప్రణయానికి హరతినిచ్చేదెవరు
నా గమనానికి వెలుగు చూపేదెవరు
చీకటిలో చిరిగిపోతున్న నా చిరు ఆశల జీవితానికి
వెలుగు చూపే దేవత కోసం ఎదురుచూస్తూ
Thursday, April 8, 2010
నా జీవత గాలిపటం
ఆ రూపుకి నీ చేతనైన రంగులు దిద్ది
అవదిలేని ఆశలతో , ఉత్సాహపు హోరుగాలిలో
ఉహకందని శిఖరాలకు, నమ్మశక్యం లేని అంచులకు
నా గమనజివితపు గాలిపటాన్ని ఎగురవేసావు
నేడు నీకు అందని దూరాలకు ఎగిరిపోయానని,
ఈ జన్మకు నీ దరికి రానేరానని భావించి
కన్నీళ్ళ తడి ఎండిన కళ్ళతో,
యద చప్పుడు కూడా భాదిస్తుందన్న భావాలతో
సడి చప్పుడు లేకుండా,కనీసం నను చూడకుండా
చిరునామాలేని చోటులకు ఒంటరిగా దారులు వెతుకుతున్నావు
ఏకాకిలా మిగిలిపోవడానికి ఏకాంతగా దారులు వెతికే ఆ మనసుకి
ఒక్కసారి ఏకాంతగా ఒక ప్రశ్న అడుగు చెలియా
ఎగురవేసిన ఆ గాలిపటపు గుండె దారం ఎవరి కరం లో ఉందని,
అది విడిస్తే దాని బతుకు ఏమౌతుందని,
చివరకు తనకు ఏమి మిగులుతుందని ...
Wednesday, April 7, 2010
నీ ఋణం తీరేనా
రాలిపోతున్న పువ్వుకి, వాలే తుమ్మదలా
వాలిపోతున్న పొద్దుకి, కురిసే వెన్నెలలా
కురుస్తున్న కుండబోత వానకి , నీడనిచ్చే గొడుగులా
నా హృదయం లోని ఆనందపుజల్లుని
నిరుత్సాహాపు ఎడారుల మద్య కురిపించి
వాడిపోతున్న ఆశకి వసంతపు పల్లకిని ఎక్కించి
చీకటి తెలియని దారుల్లో, నీ స్నేహమనే నీడతో
ఉహకందని ఉన్నతశిఖరాలకు సాగనంపావు
తీరేనా ఈ జన్మకు నీ ఋణం,కన్నీళ్ళతో నీ పాదాలు కడిగినా
తీరేనా ఈ జన్మకు నీ ఋణం,శిరస్సు వంచి ప్రణామాలు చేసినా ...
కన్నీటాంజలి
మూర్కత్వపు చర్యకు మూతబడిపోయాయి
కొండలను పిండి చేసే గుండెలు ,
కసాయితనానికి కడతేరిపోయాయి
అడివితల్లి ఎర్రబారింది,
పుడమితల్లి నెత్తుటోరింది ,చివరకు
కన్నతల్లికి కడుపుకోత మిగిలింది ,
దేశానికి గుండె మండిపోయింది .
త్యాగానికి అర్ధం చెప్పే సైనికులారా
అమ్మ గర్భం రక్షణ నుండి ఏడుస్తూ పుట్టి ,
బంధాలకు బయట నిలిచి , సుఖానికి స్వస్తి చెప్పి
దేశ రక్షణకు కై యుద్దరంగంలో అడుగుపెట్టి ,
పుడమి గర్భంలోకి ఏడిపిస్తూ చేరిపోయారు
మీ ఋణం తీరేనా మా శ్రద్ధాంజలి తో
మీ సేవకు సరితూగునా మా రాల్చే కన్నీటాంజలి తో.
మందుపాతర ఉప్పెనలో, తుపాకీ గుళ్ళ వర్షంలో,
అసువులుబాసిన వీర జవానులకు ఇవే మా అంతిమ వీడ్కోలు..
దాగుడు మూతలు
కలువలు కొలనులో దాగిపోవునా,
సూర్యుని సడితో
కమలం సరస్సులో మునుగిపోవున,
తుమ్మెద నీడతో
పుష్పం రేకులు ముడుచుకోనునా,
వసంతం పిలుపుతో
కోయిల గొంతు మూగబోవున,
మరి ఎందుకు నాకీ కొత్త భావన, ఎన్నాళ్లీ వింత వేదన
కనిపిస్తే మాయమౌతావు,కనుమరుగైతే ఎదురుచూస్తావు
పిలిస్తే పారిపోతావు,లేకపోతే ఓర చూపులు విసేరేస్తావు
దాగివున్న ప్రేమతో దాగుడు మూతలేలా
జతకట్టవలసిన జోడితో దోబుచులేలా
నీ రూపాన్ని ఆరాధించే ఆ కళ్ళకు రెప్పవై చేరవేల
నీ కోసమై నిలచివున్న నా గుండెకు చప్పుడై నిలువవేల
Tuesday, April 6, 2010
యదతీరం
అవిచేరే గమ్యం నా యదతీరం కాగ
పొంగే నురగలు నీ నవ్వులు కాగ
వాటికి తడసి నీలో నే కరిగిపోగ
వీచే గాలులు నీ ఉపిరిలు కాగ
దానికి మురిసి నా మనసు
పిల్లనగ్రోవియై రాగాలు పలకగా
వచ్చే ఆటుపోటులు నీ కోప తాపాలు కాగ
ఎదురు చెప్పక నే మౌనంగా నిలువగ
పున్నమి లో నీవు పరవశించి నాట్యం చేయగ
ఆ మత్తులో నన్ను నే మై మరచిపోగా
సాగిపోని ఈ జీవితం నీ నీడలో కడదాక
నిలచిపోని బంధం మన ఉనికి ఉన్నంతదాక
Sunday, April 4, 2010
అమ్మ నాన్న
చూసే ప్రపంచం రెండు కళ్ళతోనే
రెండు గుండెల చప్పుడు కాని
నిలిచేది ఒక గుండె చప్పుడు తోనే
ఎందరో ఆత్మీయులు కాని
ప్రాణం నిలుపుకోన్నది ఒక బంధం కోసమే
సామెతలుగా వున్న ఈ పదాలను
ఒక్కసారి మనసుకు అడుగు నేస్తమా ...
కన్నీళ్ళు తిరిగే కళ్ళతో ,
వణుకుతున్న పెదాలతో చెబుతుంది
సప్తస్వరాలు ముందు నిలిచి గానం చేసినా
కోటి రాగాలు చూసేది నీ పిలుపులోనే అని
దివిని భువిని కలిపేస్తూ
కనులకి పట్టని అందాలు ఎన్ని నిలచినా
ఆనందం కలిగేది నీ రూపుతోనే అని
పంచభక్ష పరమాన్నాళ్ళు ఎన్ని ముందు పెట్టినా
కడుపునిండేది నీ ఆరగింపుతోనే అని
వారు మన అమ్మ నాన్న అని
వాళ్ళ ప్రపంచం మనమే అని.
Tuesday, March 30, 2010
నీ తోడే లేనపుడు
రాగాలను పలకలేనినాడు, కోయిలకు వసంతాలెందుకు
సువాసనలు విరజిమ్మనపుడు , పువ్వుకి ఆ రంగులెందుకు
నీ తోడే నాకు లేనపుడు ఈ జన్మకు బ్రతుకెందుకు.
కదిలిపోని జీవితం అమావాస్య చంద్రుడిలాగ
రాలి పోనీ జీవితం వాడి పోయే పువ్వులాగ ......
ఈ జన్మకు
నేనొక చంద్రున్నని, అందులో నా మనసొక ఆకాశామని
నే పలికే పలుకులు చుక్కలని, నే నవ్వే నవ్వులు వాటి వెలుగులని
ఆ వెలుగుల్లో నీవు తడిసిపోవాలనే అందమైన పలుకులు పలికి,
మనసులోతుల్లో ఆరని ప్రేమజ్యోతులను వెలిగించావు
నేడు ఆ జ్యోతులు నను నిలువునా కాల్చివేసినా
లేక నను నిలువునా మసిచేసినా
వాటి వెలుగుల్లో నీ నిలువెత్తు రూపం నాట్యం చేస్తూ మురిసిపోతుంటే
ఆ మురిపెంతో ని చిరు పెదవులపై ముసి ముసి నవ్వులు తాండవిస్తుంటే
చాలదా ఈ జన్మకు జీవితం
చాలదా ఈ జన్మకు దానిలో కలిగిన ఆనందం
చాలదా ఈ జన్మకు ఆ ఆనందం లో కలిగిన పరవశం
చాలదా ఈ జన్మకు కారణమైన ఆ నా ఒక్క క్షణం
Monday, March 29, 2010
ఇంద్రియాలు లేని మనసు
అవి చూసే చూపు బట్టి, వినే మాటలను బట్టి
తాకే స్పర్శను బట్టి, పీల్చే వాసను బట్టి
నడిచే నడతను బట్టి, చేసే చేతలను బట్టి
తేడాలను కనిపెట్టి, నా గమనాన్ని నిర్ధేశించగలవు ,
కాని
నిను వలచిన నామనసుకి ఈ తేడాలు తెలియదు ప్రియా ..దానికి
ఉక్రోశంతో కోపాన్ని చూపించినా,ఉల్లాసంతో తీయని మాటలు వినిపించినా
ఉద్రేకంతో నిలువునా అగ్నికి దహన మిచ్చినా,
వెచ్చని ఉపిరిలను యదపైకి ప్రవహింపచేసినా,
చేతిలో చేయి పట్టి ఉన్నత మార్గాలకు నడిపించినా
ఆ దారిలో ముల్లదారిని పట్టించినా
ప్రేమిచడం తప్ప ఏమి చేయలేని
మూగది, చెవిటిది
గుడ్డిది ,కదలలేని అవిటది................................
ఎప్పుడు ఏమౌనో
గంటకొకసారి పుట్టుకొచ్చే చల్లని మంచు పర్వతాలు తెలుసా
నిమిషానికి ఒకసారి విరబుసే పుష్పాలు నీకు తెలుసా
అర క్షణానికే వాడిపోయే సువాసనలు తెలుసా
ఇవన్ని కలసి ఒకే చోట జరిగే ఆ చోటు తెలుసా
ఆ చోటు నా మదిలో నిక్షిప్తమైతే
అది పడే బాధ తెలుసా
ఆనందానికి కారణం వుండదు ,బాధకు కారణం వుండదు
నవ్వుకి కారణం వుండదు , కారే కన్నిటికి కారణం వుండదు
ఇలా ఏ కారణం లేకుండా సాగే జీవితాన్ని
కారణం లేకుండా నా జీవితానికి ఆపాదించి
కనిపించని దూరాలకు కానరాకుండా కనుమరుగైపోయావు
ఎలా ప్రియా నన్ను నేను మార్చుకోనేది
ఎలా నిన్ను మరచిపోయేది
ఏదైతే ఏంటి
నడుస్తున్న కాలం
వసంతమైతే ఏంటి, ,గ్రీష్మం ఐతే ఏంటి
గడుస్తున్న సమయం
పగలైతే ఏంటి, రాత్రైతే ఏంటి
వెళ్తున్న దారుల్లో
ముల్లకంపలుంటే ఏంటి, తివాచీలు పరిస్తే ఏంటి
నిలచున్న చోటులో
శ్మశానాలు వుంటే ఏంటి ,పచ్చని పైర్లుంటే ఏంటి
నా మనసుకు నచ్చిన చెలి నా తోడుని కోరి
నా జన్మకు నీడగా వచ్చి చేరాక....జీవితం
వసంతమవదా ప్రతి కాలం
వెన్నెలలు కురియవా ప్రతిసమయం
పూల పరదాలు పరచదా ప్రతి దారి
ఉద్యానవనాలు కావా ప్రతి చోటు
గుండె బారం
కలగా నీ యదలో సడిచేసినపుడు మురిసే పెదాలకు
ఇలగా నీ ఎదుట నిలచినపుడు మౌనాలేందుకు
నా జతగా గతంలో చేసిన అల్లర్లను
నీ నడిచే దారుల్లో జ్ఞాపకాలుగా ఎదురుపడినపుడు కలిగే పరవశం
నేడు తోడు గా పిలుస్తుంటే రావెందుకు
కలలో వున్న తీపిని ఇలకు నింపవెందుకు ప్రియా
జ్ఞాపకాలలో కలిగిన హాయిని ,నడిచే కాలంలో కురిపించవెందుకు ప్రియా
కల ఏమైనా కలుపుతుందా
గురుతులేమైనా గుండె బారాన్ని దింపుతాయా
జతగా నే పిలుస్తుండగా
సంకోచం
తనను అనుసరిస్తూ సాగిన మన గీతాలు
ఏ పూసే వసంత పూతోటకు తెలియదు
ఒంటరిగా వెళ్లి జంటగా చేసిన చిలిపి అల్లర్లు
ఏ పారే సెలయేటికి తెలియదు
మనం కలసి చేసిన జలకాలాటలు
ఏ చీకటి రేయికి తెలియదు
పరవశం తో పంచుకొన్న అభిరుచులు
ఇక నాతో చెప్పిస్తావేల ప్రియా
Saturday, March 27, 2010
భాషరాక
నా మనసులోని ఆశలు అడియాసలు గానే మిగిలి
అంతమౌతున్నాయి
భాష నేర్పేదెవరు, దాని భాద వినేదెవరు
ఆశలకు శ్వాసనిచ్చేదెవరు, వాటికి జీవం పోసేదేవరు
Friday, March 26, 2010
కాలం.
నా నీడకు జోడుగా తోడైన తనను వేరుచేయ్యోద్దని
నా మాట వినలేదు
చీకట్లను పిలిచావు ,నీడను మాయం చేసావు
కన్నీళ్లను రప్పించావు,గుండెకు కోతను మిగిల్చావు
దూరమైన చెలిని చేరే దారులను దరిదాపుల్లోకి రానివ్వోద్దని దాసీ లా అడిగాను
నను లెక్క చేయలేదు,
గాలాన్ని వేసావు ,గమనాన్ని మార్చావు
శిధిలమైపోయిన చిరునవ్వులకు చిరు ఆశలను కల్పించావు........
ఏమిటి మాయ ,
నీ ఆటకు మే పావులామేనా ,నీ చేతిలో మే కిలుబోమ్మలమేనా
Thursday, March 25, 2010
హృదయ స్పందన.
కాని పూయడం మానునా
కాసే వెన్నెలకు తెలుసు తన పూర్ణ బింబం కనిపించేది ఒక రాత్రని
కాని కాంతిని వెధజల్లుట మానునా
దూరమైన నా మనసుకి తెలుసు,నీవు తన దరికి చేరవని
కాని నిను తలవడం మానునా
మరచిపోవాలని మనసులోవున్నా
ఆ ప్రేమకు మసిపుయాలని ఆలోచన వున్నా
నీ తలపులతో అవితధైపోయిన నా హృదయం
ఆ పిలుపులకు స్పందనివ్వకుంటోంది
ఎలా మాపాలి
నా కను రెప్పలను వాలనియకుండా
వాలిన వాటిని నిలువనియకుండా
సున్నితమైన నా మదికోలువలో
ఆగని అలజడులను రేపుతూ
నిదురలేని రాత్రులను మిగుల్చుతున్నాయి
ఎలా మాపాలి నీతో నా గతాన్ని
ఎలా ఆపాలి ఆ జ్ఞాపకాల స్వప్నాల్ని
పేజీలు లేని పుస్తకం.
ఒకరు ప్రేమిస్తారని ఆశతో తోడు నడిచాను
వేరొకరు ప్రేమిస్తున్నారని భయంతో దూరమౌతున్నాను
భ్రమతో మొదలైన నా ప్రేమ భయానికి చేరువై
చివరకి పేజీలు లేని పుస్తకమై
అందులో ఏమిరాసుకోలేని చేతకానివాడినీ చేసి
మానని గాయం చేసి నిలచింది
అద్దం
నా హృదయపుతద్ధంలో నీ రూపుని ఒకటే నిలిపినా
అది ఏనాడు కన్నిటికి కారణం కాలేదు.
నీ ఎడబాటుతో అది పగిలి
అందులో నీరూపాలను ఎన్ని కొలువుంచినా
అది ఈనాడు కన్నీటిని తుడవటం లేదు
తడబాటు...
ఆ తాకిడి నను తాకిన మరుక్షణం లో , నే చూసేసరికి ,
నీ చూపుల దిశలను మార్చిన వేగమెంత ...
తడబాటులేల ప్రియ నీ ఎడబాటును కోరుకున్ననా,
చేరువకు దరిచేరవేల చెలియా,కాదని నిన్ను పొమ్మన్నాన
Wednesday, March 24, 2010
శ్రీరామ నవమి.
ఆ రూపానికి రెండు నెలవంకలను అద్దిన వేళ,
అద్దిన ఆ రూపానికి సూర్య కాంతులు
తేజస్సుని ఇచ్చిన వేళ,
ఆ తేజస్సుకి ముగ్ధమై
ఇంద్రధనస్సు దరిచేరిన వేళ,
ముక్కోటి దేవతల సాక్షిగా ,
వర్షాన్ని ప్రతిబింబెంచేలా , పూలవర్షం కురిసిన వేళ,
ఆ రూపం శ్రిరాముడిగా అవతరించిన వేళ ...........
మీకు ,మీ కుటుంబ సభ్యులకు
శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెబుతూ........
ఇక్కడ
ఆకాశం అతని నీలి వర్ణపు మేను ఛాయకు,
నెలవంకలు అతని దివ్యమైన కనులకు ,
సూర్య కాంతులు అతని తేజస్సుకి ,
ఇంద్రదనస్సు అతని విల్లుకి, ప్రతీకలు ,,,,,,,,,, .
కొత్తలోకం.
నా పయనం .
కదిలే కాలానికి ఇక నా బాషలో విలువేముంది.
కదలలేను,మెదలలేను,
కనీసం ఒక అడుగు ముందుకు వేయలేను.........
నీ మనసు లోతుల్లో దాచిపెట్టి
వీయకుండా ఆపిన ప్రేమపవనాలు వీస్తే తప్ప.....
అవి వీచేదెపుడు ,వాటిలో తడిసేదేపుడు
తడిసి వాటితో కలిసేదెపుడు,
కలసి చివరివరకు సాగేదేపుడు..........
Saturday, March 20, 2010
అమ్మ.
తన మదిని అర్పించానని పలికితే
పది కాలపాటు పచ్చగా ఉండాలని
ప్రతిక్షణం పరితపించే పాలిచ్చిన తల్లికి
పాశానికి బలిచేయుట న్యాయమా...............
గులాబి పువ్వు చేతపట్టుకొని
గుండెల్లో గుప్పెడు ప్రేమను నింపుకొని
వడి వడి పాదాల అడుగులతో ,అలుపులేని భావాలతో
గువ్వను చేరిన గోరింకా ......
వడితో చెలిని చేరిన పాదాలను అడుగు
మొదటి అడుగు ఎవరు నేర్పారని,
వలపుతో నీ చెలికోసం పువ్వు పట్టిన చేయినడుగు
తన మొదటి స్పర్శ అనుభూతి ఎవరితో అని,
మెప్పు కోసం చెలితో ఉసులు చెబుతున్న జిహ్వానడుగు
తను మొదట పలికిన మాట ఎవరు నేర్పారని,
నిమిషపు వ్యవధిలో నీ చెలికి అప్పగించిన హృదయాన్ని అడుగు
దానికి చప్పుడు ప్రసాదించిన దేవత ఎవరా అని.
పిలుపు.
కాని వికసించడం మానునా ..
కాసే వెన్నెలకు తెలుసు ,తన పూర్ణ బింబం కనిపించేది ఒక రాత్రని
కాని కాంతిని వెదజల్లుట మానునా
వలచిన నా మనసుకి తెలుసు ,నీవు సరైన జోడివికావని,
కాని తలచుట మానునా..
మరచిపోవాలని వున్నా, నాలో ప్రేమకు మసిపుయాలని వున్నా
నీ తలపులతో అవిటధైపోయిన హృదయం
ఆ పిలుపును ఆలకించకుంది ...
Friday, March 19, 2010
ఒకటే ప్రేమ
గాయం చేసిన గుండెలోని మరలా మొలకెత్తే ప్రేమ ఉండునా ...............
నీ వోక్కరివే
విరిసే సువాసన ఒకటే కదా
నే రాసే అక్షరాలలో కనిపించే అర్ధాలు ఎన్నివున్నా ,అందులో వున్నది
నే వలచిన నీ ప్రేమొక్కటే కదా
Thursday, March 18, 2010
వీడేదెలా
నువుకోసిన గొంతుకు రాగాలుపలికే వీలుందా
నీ తలపుని వీడిన నా మనసుందా,నీ ప్రేమని తలవకుండా పీల్చిన నా శ్వాశుందా .....
నా హృదయపు ద్వారపు తలుపులు తెరచి ,
సున్నితమైన మనసుకి కన్నీళ్లను జోడించి,
తేనె పూసిన నాలుకతో కబుర్లను వినిపించి
అలకలతో,నీ ఉలుకులతో
మెలికలతో అందులోని నీ తలుకులతో
నీ జ్ఞాపకాలను పంపించేశావు ..
వెళ్లేదారి మాత్రమే వున్న మనసు నాది,
మరి వాటి దారి మళ్ళించేదెలా ...
Wednesday, March 17, 2010
యాతన
మరణానికి ఎదురుగా పోరాడగలనేమో
సునామిలకు సరితూగగలనేమో,తుపానులకు ఓర్చుకోగలనేమో
కాని ఒక్క క్షణం ...ఒకే ఒక్క క్షణం
అది నీవు గుర్తుకొచ్చే క్షణం
నీ జ్ఞాపకాలు తొలిచే క్షణం
నీ చూపులు నను తడిమే క్షణం ,నీ తలపులు నను చేరే క్షణం
యదచేస్తున్న సడి ని ఆపలేకున్నాను
అది పడే యాతనకు నిలువలేకున్నాను.
మరి .....
ఆ చూపులో ఎన్ని సునామీలో ...
ఆ మాటల్లో ఎన్నితుపానులో..
ఆ నడకల్లో ఎన్ని ప్రళయాలో
ఆ భావాల్లో నను చంపే ఎన్ని అర్ధాలో ...
Tuesday, March 16, 2010
ఉగాది..
విక్రుతికి విరహ గీతం పాడుతూ..
విరోధి కి స్నేహ హస్తాన్ని అందిస్తూ..
రాలేమంచు కురవనంటోంది
పూచే పుష్పం రాలిపోతునదేమోనని..
వేకువజాము చీకటి వెల్లనంటోంది...
కూసే కోయిల గానం ఆగిపోతునదోమోనని..
తెలుగు సమత్సరాది తో..
జీవితపు వసంతపు వాకిట తలుపులు తెరవాలని ఆశిస్తూ ..
Saturday, March 13, 2010
తికమక
సంద్రాన్ని చేరిన జలపాతానివా...పారే సెలఎరువా ..
ఒకసారి ఒంటరి నంటావు ..ఒకసారి తోడు కుదిరిపోయినదంటావు
ఒకసారి నా తోడు నంటావు..మరోసారి నిలువనంటావు..
నీ బాషకు అర్ధం తెలియక, నీ నడతను కనుగొనలేక ...
నిను చూసే నా కళ్ళు
కలలకు చేరువై..ఇలను మరచి..
ఎడారిలాంటి నీమనసులో ..
మంచుపర్వతం లాంటి నా ప్రేమ దాగుందని
తలచుకొంటూ మురిసిపోతుంది..
ఏ మాయ చేసావే
ఏ మాయచేసావే ..నే నడిచే దారిలో
ఏ మాయచేసావే .....నే పీల్చే గాలిలో
ఇంకేమాయచేసావే ..అది చేరే నా గుండెలో..
చూపు నిను మరువనంటుది...పాదం నీ దారిని విడవనంటుంది ..
శ్వాస నీ ఉపిరికి చేరువౌమంటోంది..హృదయం నీ తలపును విడువనంటోంది
కన్నీటి సంద్రం ..
ఆకలి లేని ప్రపంచాన్ని చూపాను ..
బాధగా వుందంటే..
తరగని సంతోషాలను రుచి చూపించాను
జీవితం నిసిరాతిరి కి చేరువ అవుతుందంటే
వెన్నెల వెలుగులకు దారి చూపించాను ////
మరి నన్ను బదులుగా .....................
కన్నిటి సంద్రం లో ముంచడం .....?
అహం..
మెరిసే చుక్కలు ఇక నా సొంతమని
వెలుగునిచ్చే వెన్నెల ఇక నా చెంతేనని
విశాలమైన శూన్యం కి ఇక ఎవరు రాలేరని
అనుకొనే నీ ఉహా ప్రపంచానికి ఒక్కసారి అడుగు....ఈ ప్రశ్న ?
బాధలో నిను ఓదార్చే తోడు ఎవరా అని...
ఇక్కడ చుక్కలు - కోరికలు...వెన్నెల - ఆనందానికి ప్రతీకగా వాడాను
Monday, February 15, 2010
తిరుగమనం
ముసి ముసి నవ్వులను మొహం నిండా అద్దుకొని
మురిపెంగా పిలుస్తుంటే
మదిని మందలించి తనతో ముందడుగు వేయాలా ..
మరచిన గతాన్ని పిలచి దూరంగా పోవాలా
కనురెప్పల చాటున కన్నీళ్ళని దాచుకొని
పలికే పెదాలలో వణుకును నింపుకొని
మారానని మారం చేస్తూ
మదిని మెలికలు పెట్టేస్తున్న తన వ్యధను
మౌనంగా స్వీకరించాలా........
కళ్ళల్లో కన్నీటి నదులను పరిగెత్తించి
గుండెల్లో ఉప్పెనలను రేకెత్తించి
నా మనసుకి చేసిన గాయానికి
బదులు తీర్చుకోనా
Sunday, February 14, 2010
మనసు మారిన స్నేహం
బదులు లేని ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్న నీ మనసు కి
ఏమని బదులు చెప్పాలి..
బాషకు రాని భావాలను చూపే నీ రూపాన్ని
ఏ విధంగా అని చూడాలి ..
కన్నీళ్ళు తుడిచే నీ మనసు పెట్టె కన్నీళ్లను
ఏమని ఓదార్చి తుడవాలి
ప్రేయసి విరహం తో రగిలిపోతున్న నా మనసు
తనను మరచి నీతో కలసి నడవలేదని
ఎలా అని చెప్పాలి ...నేస్తమా
పారే నదికి మరల పాతనీరు రాకపోవోచ్చు
ఎండిన తరువుకి మరల పాత చిగుర్లు మొలవక పోచ్చు
ఎగిరే తుమ్మెద ఒకే పుష్పం పై నిలువకా పోవొచ్చు ..కాని
రెక్కలు లేని తుమ్మెద నా మనసు
వాడిపోని తరువు నా మనసు
ముందుకు సాగలేని ప్రవాహం నా మనసు
తన తోడుకు ఏనాడో అంకితమైపోయింది
ప్రేమికుల రోజు
ఉహలకు అందని ఉహా లోకాలను
ఉహలలోనే దాచుకొని..
ఆ ఉహలలో ఉసులను
నాముందు కదలాడే
నీ ఉహాల రూపంతో పంచుకొని
యద లోపలే నీ జ్ఞాపకాల లోగిలిలో
దాగుడుమూతలు ఆడుకొంటూ
నీ తలపులతో సహజీవనం సాగిస్తున్న నా మది
నేడైనా నా మనసు తెలేపేనా...
కరగని కన్నీటి వ్యధ
కన్నీటి చుక్క విలువ తెలుయునా ..
మమకారం లేని హృదయానికి
మనసు చెప్పే వేదన అర్ధమౌనా ...
ఏడ్చి ఏడ్చి కన్నీరు నదిలా పారాలే తప్ప
తలచి తలచి గుండె ఎడారై పోవాలె తప్ప
ఆగక, నిలువక
నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...
-
కంచికి చేరని కధైపోయింది నా జీవితం సాగరాన్ని చేరని నధైపోయింది నా గమ్యం పువ్వుని చేరని తుమ్మధైపోయింది నా ప్రణయం వెలుగే చేరని చోటైపోయి...
-
నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...
-
సాగర తీరపు అలలు నీ నడకలు కాగ అవిచేరే గమ్యం నా యదతీరం కాగ పొంగే నురగలు నీ నవ్వులు కాగ వాటికి తడసి నీలో నే కరిగిపోగ వీచే గాలులు నీ ఉపిరిలు ...